Minister Srinivas Yadav | చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించడం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అందరికీ అభినందనలు తెలిపారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో శుక్రవారం నిర్వహించిన చేప ప్రసాదం కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి చేప ప్రసాదం పంపిణీ చేసిన బత్తిన హరినాథ్ గౌడ్, కుటుంబ సభ్యులు, అక్కడకు వచ్చిన వారికి ఉచితంగా అల్పాహారం, భోజనం అందించిన స్వచ్ఛం సంస్థలు, వలంటీర్లు, జీహెచ్ఎంసీ, పోలీస్, ట్రాఫిక్, ఎలక్ట్రికల్, వాటర్ వర్క్స్, హెల్త్, శానిటేషన్, ఫైర్, మత్స్య, ఆర్అండ్బీ తదితర శాఖల అధికారులతో పాటు ఎగ్జిబిషన్ గ్రౌండ్ సొసైటీ సభ్యులు, మీడియా ప్రతినిధులకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు.