బడంగ్‌పేట/కందుకూరు/మహేశ్వరం/ఆర్కేపురం, మే 5 : మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడ దాతునగర్లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి పుట్టినరోజు వేడుకల సంబురాలు అంబరాన్నంటాయి. ఉదయం 9గంటల నుంచి క్యాంపు కార్యాలయం కోలాహలంగా మారింది. క్యాంపు కార్యాలయం చుట్టూ ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేసి గులాబీ మయంగా చేశారు. కేక్ కట్ చేసి.. మిఠాయిలు పంపిణీ చేసి.. నోట్ బుక్స్ అందజేసి మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి రక్తదానం చేశారు. వృద్ధులకు, పిల్లలకు, అనాథాశ్రమంలో పండ్ల పంపిణీ చేశారు. బడంగ్‌పేట, మీర్‌పేట, జిల్లెలగూడ, బాలాపూర్, నాదర్గుల్, మల్లాపూర్, తుక్కుగూడ, కందుకూరు. జల్పల్లి, మహేశ్వరం, ఆర్కేపురం, సరూర్‌నగర్ నుంచి పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యంలో తరలి వచ్చారు.
గ్రామాలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, డివిజన్ల పరిధిలో మంత్రి జన్మదినం సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఎమ్మెల్సీ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, రంగారెడ్డి జిల్లా డీఈవో సుసీందర్ రావు, ఆర్డీవో శరత్ కుమార్, మేయర్ దుర్గా దీప్లాల్ చౌహాన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, కందుకూరు మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మన్నే జయేందర్ ముదిరాజ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సురుసాని సురేందర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ చంద్రశేఖర్, ఎంపీటీసీ ఫోరం అధ్యక్షుడు సురుసాని రాజశేఖర్‌రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మహేశ్వరం మండల అధ్యక్షుడు అంగోతు రాజునాయక్, నియోజకవర్గం ఉపాధ్యక్షుడు హనుమగల్ల చంద్రయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ వర్కల యాదగిరిగౌడ్, బీఆర్ఎస్ ఆర్కేపురం డివిజన్ అధ్యక్షుడు పెండ్యాల నాగేశ్, నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి మురుకుంట్ల అరవింద్‌శర్మ, ఖిల్లా మైసమ్మ ఆలయ చైర్మన్ గొడుగు శ్రీనివాస్‌ముదిరాజ్, తాసీల్దార్ జనార్దన్, బడంగ్‌పేట కమిషనర్ కృష్ణ మోహన్ రెడ్డి, తుక్కుగూడ కమిషనర్ వెంకట్ట్రామ్, జల్పల్లి కమిషనర్ వసంత, డీఈలు గోపీనాథ్, అశోక్ రెడ్డి, ఏసీపీలు పురుషోతం రెడ్డి, ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్ రెడ్డి, సీఐ మహేందర్ రెడ్డి, కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వివిధ విభాగాల అధికారులు తదితరులు పెద్దసంఖ్యలో తరలివచ్చి మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.