HomeHyderabadMinister Sabitha Indra Reddy That They Are Working For The Development Of Mirpet With A Special Vision
ప్రత్యేక విజన్‌తో మీర్‌పేట అభివృద్ధి
ప్రత్యేక విజన్‌తో మీర్‌పేట అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్‌పేట కార్పొరేషన్ పరిధిలోని 9వ వార్డులో రూ. 65 లక్షలతో, 10వ వార్డులో రూ. 50 లక్షలతో సీసీ, బీటీ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
బడంగ్‌పేట, జూలై 9 : ప్రత్యేక విజన్‌తో మీర్‌పేట అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్‌పేట కార్పొరేషన్ పరిధిలోని 9వ వార్డులో రూ. 65 లక్షలతో, 10వ వార్డులో రూ. 50 లక్షలతో సీసీ, బీటీ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో మీర్‌పేట కార్పొరేషన్లో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. ఒక ప్రత్యేక విజన్‌తో మీర్‌పేట కార్పొరేషన్‌ను అభివృద్ధితో ఆదర్శ కార్పొరేషన్‌గా తీర్చిదిద్దుతామన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా సమీకృతా మార్కెట్, వైకుంఠ దామాల నిర్మాణం, స్వచ్ఛత చిరునామాలుగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు తాజాగా రూ. 150 కోట్ల నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. నాళాల అభివృద్ధికి రూ. 110 కోట్లతో మహేశ్వరం నియోజకవర్గంలో పనులు జరుగుతున్నాయన్నారు.
తాగునీటి సమస్య లేకుండా చేయటానికి రూ. 210 కోట్లతో మిషన్ భగీరథ ద్వారా పనులు చేపడుతున్నట్లు నూతన పైపులైన్లు, ట్యాంకులు, రిజర్వాయర్లు కడుతున్నామని మన నియోజకవర్గంలో బడంగ్‌పేట, మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని, జల్పల్లి, తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో 10 చెరువులలో రూ. 40 కోట్లతో అభివృద్ధి సుందరీకరణ పనులు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతు భీమా, రైతుబంధు, రైతులకు ఉచిత విద్యుత్, కుల, చేతి వృత్తుల వారికి రూ. లక్ష ఆర్థిక సహాయం, గౌడన్నలకు రూ. 5 లక్షల భీమా సౌకర్యం, నేతన్నలకు పెన్షన్, మత్స్యకారులకు, ముదిరాజ్ కులస్థులకు చెరువులో ఉచిత చేపలు వదలడం, మార్కెటింగ్ సదుపాయాలు, గొ ల్ల కురుమలకు గొర్రెల పంపిణీ, రజకులకు నాయి బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్, ఎస్సీ, ఎస్టీలకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు మంత్రి వివరించారు.
దేశమంతా తెలంగాణ పథకాలు కావాలంటూ ప్రజలు డిమాండ్ చేస్తున్నారని, తప్పకుండా దేశంలో, తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ దుర్గా దీప్లాల్ చౌహాన్, డిఫ్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, అధ్యక్షుడు కామేశ్‌రెడ్డి, మాజీ అధ్యక్షురాలు సిద్దాల లావణ్య, కార్పొరేటర్లు ముద్దవపన్, ధనలక్ష్మీరాజ్కుమార్, 9వ వార్డు బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి నర్సిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.