పహాడీషరీఫ్/మహేశ్వరం, ఏప్రిల్ 17 : షాదీముబారక్, కల్యాణలక్ష్మి పథకంతో పేదింటి ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ అందించే చిరుకానుక అని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 539 మంది షాదీముబారక్, కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు సోమవారం చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు కేసీఆర్ ఇచ్చిన గొప్ప వరమన్నారు. ఎంతో మంది పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఆసరాగా ఉంటుందన్నారు. బాలాపూర్ మండల పరిధిలోనే ఇప్పటి వరకు రూ.59 కోట్ల 39 లక్షలకు సంబంధించిన చెక్కులను లబ్ధిదారులకు అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కందుకూరు ఆర్డీవో సూరజ్‌కుమార్, బాలాపూర్ మండల ఎమ్మార్వో జనార్దన్‌రావు, చైర్మన్ అబ్దుల్లా సాది, కమిషనర్ వసంత, కో -ఆప్షన్ మెంబర్ సూరెడ్డి కృష్ణారెడ్డి, కౌన్సిలర్లు బుడుమాల యాదిగిరి, షేక్ అఫ్జల్, జాఫర్బామ్, అహ్మద్ కసాది, జింకల రాధికాశ్రావణ్, మజర్ అలీ, సయ్యద్ యాహియా, లక్ష్మీనారాయణ, శంకర్, బీఆర్ఎస్ నాయకులు యూసుఫ్ పటేల్, యంజాల జనార్దన్, షేక్ జహంగీర్, వాసుబాబు, యంజాల అర్జున్, నిరంజన్ నేత, ఇద్రీశ్, నాగేశ్ ముదిరాజ్, సాంబశివ తదితరులు పాల్గొన్నారు.
పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదర సోదరీమణులు ఉపవాసాలు ఉండి ఇఫ్తార్ విందులు నిర్వహిస్తూ మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ జల్పల్లి మున్సిపాలిటీ జనరల్ సెక్రటరీ షేక్ జహంగీర్ ఆధ్వర్యంలో జల్పల్లిలో, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు యూసుఫ్ పటేల్ ఆధ్వర్యంలో షాహీన్‌నగర్‌లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ముస్లిం సోదర, సోదరీమణులకు పండ్లు తినిపించి ఉపవాస దీక్షను విరమింపజేశారు. రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో అన్ని మతాలకు, కులాలకు సమాన గౌరవం ఇస్తున్నారన్నారు. దసరా సందర్భంగా చీరల పంపిణీ, క్రిస్మస్ సందర్భంగా కానుకలు, రంజాన్‌కు తోఫా అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కో- ఆప్షన్ మెంబర్ సూరెడ్డి కృష్ణారెడ్డి, వాసుబాబు, బర్కత్ అలీ, మన్నన్, సయ్యద్ ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు.
మన్సాన్పల్లి నుంచి కోళ్లపడకల్కు వయా గట్టుపల్లి, అకాన్‌పల్లి మీదుగా రోడ్డు నిర్మాణ పనులకు రూ.15.20 లక్షల వ్యయంతో రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రత్యేక చొరవతో నిధులు మంజూరు చేసినందుకు అకాన్‌పల్లి గ్రామ నాయకులు మంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ యాదయ్య, ఉపసర్పంచ్ గురుప్రీత్ నాయకులు చంద్రశేఖర్‌రెడ్డి, జితేందర్, నరసింహ, దేవేందర్, శ్రీకాంత్, గణేశ్, నరేశ్‌గౌడ్, శంకర్, నరసింహ, శ్రీశైలం, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.