రాష్ట్రంలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ ఖాయం
రాష్ట్రంలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమని, సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు శ్రీరామరక్ష అని మహేశ్వరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఆర్కేపురం డివిజన్ హరిపురి కాలనీ రోడ్డు నం.1లోని గ్రీన్ టవర్స్ అపార్ట్మెంట్స్ వాసుల ఆత్మీయ సమ్మేళనం నియోజకవర్గ బీఆర్ఎస్ మహిళా వర్కింగ్ అధ్యక్షురాలు పటేల్ సునీతారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.
- సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు శ్రీరామరక్ష
- మంత్రి సబితాఇంద్రారెడ్డి
- గ్రీన్ టవర్ అపార్ట్మెంట్స్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మంత్రి
ఆర్కేపురం, నవంబర్ 13: రాష్ట్రంలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమని, సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు శ్రీరామరక్ష అని మహేశ్వరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఆర్కేపురం డివిజన్ హరిపురి కాలనీ రోడ్డు నం.1లోని గ్రీన్ టవర్స్ అపార్ట్మెంట్స్ వాసుల ఆత్మీయ సమ్మేళనం నియోజకవర్గ బీఆర్ఎస్ మహిళా వర్కింగ్ అధ్యక్షురాలు పటేల్ సునీతారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సబితాఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మెట్రోతో అభివృద్ధి శరవేగంగా జరగనుందని తెలిపారు.
ఈ ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు, బస్తీల్లో బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమస్యల పరిష్కారానికి మంత్రి కేటీఆర్ ప్రతి డివిజన్‌కు ఒక వార్డు కార్యాలయం ఏర్పాటు చేశారన్నారు. మరోసారి ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దయానంద్‌గుప్తా, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీధర్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి అరవింద్‌శర్మ, డివిజన్ అధ్యక్షుడు నగేశ్, షాబాద్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రవీందర్‌రెడ్డి, డివిజన్ మహిళా అధ్యక్షురాలు ఊర్మిలారెడ్డి, శ్రీనివాస్, వెంకటేశ్ గౌడ్, రామ్నర్సింహాగౌడ్, రమేశ్, పెంబర్తి శ్రీనివాస్, జగన్మోహన్రెడ్డి, ఎం.ఏ.సాజీద్, యాదవరెడ్డి ఉన్నారు.
మంత్రి సబితాఇంద్రారెడ్డికే బ్రాహ్మణుల మద్దతు
బ్రాహ్మణుల సంక్షేమానికి పాటుపడుతున్న మంత్రి సబితాఇంద్రారెడ్డికే ఈ ఎన్నికల్లో బ్రాహ్మణులంతా మద్దతు తెలుపుతున్నారని రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, మహేశ్వరం నియోజకవర్గ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి మురుకుంట్ల అరవింద్‌శర్మ తెలిపారు. సోమవారం ఆర్కేపురం డివిజన్ గ్రీన్‌హిల్స్ కాలనీలోని బీఆర్ఎస్ కార్యాలయంలో నియోజకవర్గ బ్రాహ్మణ సంఘాల ఐక్యవేదిక సమావేశం నిర్వహించారు. మంత్రి సబితాఇంద్రారెడ్డికి మద్దతుగా బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో నవంబర్ 18న బడంగ్‌పేట్‌లోని పెద్దబావి మల్లారెడ్డి గార్డెన్లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నామని, ఈ సమావేశానికి బ్రాహ్మణులు తరలి రావాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బ్రాహ్మణ సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు మంగు రాఘవరావు, ప్రధాన కార్యదర్శి ప్రమోద్ కోటర్, యాదగిరిరావు, నారాయణరావు, పీవీజీకే పూర్తి, రామారావు, మంత్రి రవీందర్రావు, శ్యాంసుందర్‌రావు, శ్రీమన్నారాయణ, అనురాధ, అన్నపూర్ణ, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

