e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, August 5, 2021
Home హైదరాబాద్‌ తండాల రూపురేఖలు మారుస్తాం

తండాల రూపురేఖలు మారుస్తాం

తండాల రూపురేఖలు మారుస్తాం
  • 12 వేల కోట్లతో ఎస్టీ సబ్‌ప్లాన్‌ కింద అభివృద్ధి పనులు
  • 100 కోట్లతో తండాలకు విద్యుత్‌ సౌకర్యం
  • విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి
  • నాగులదోని తండాలో 93 లక్షలతో అభివృద్ధ్ది పనులకు శంకుస్థాపన

మహేశ్వరం, జూలై 19 : మా తండాలు.. మా పాలన అనే నినాదంతో గిరిజన తండాలను పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని, అభివృద్ధితో తండా ల రూపురేఖలు మారుస్తామని మంత్రి సబితారెడ్డి అన్నా రు. సోమవారం మండల పరిధిలోని నాగులదోని తండా లో రూ. 93 లక్షలతో డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులను జడ్పీ చైర్‌ పర్సన్‌ తీగల అనితాహరినాథ్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యువత వ్యాపారాలు చేసుకోవడానికి ప్రభుత్వం రుణా లు మంజూరు చేస్తుందన్నారు. తండాలకు అప్రోచ్‌ రోడ్ల నిర్మాణంతో తండాల రూపు రేఖలు మారుతున్నాయని తెలిపారు.

పల్లె ప్రగతిలో అన్ని గ్రామాల సర్పంచ్‌లు పో టీ పడి పనిచేశారని చెప్పారు. పెండింగ్‌లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. రాష్ట్రంలో ఎస్టీ సబ్‌ప్లాన్‌ కింద 12 వేల కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. పల్లె నిద్రలో భాగంగా గ్రామ సమస్యల పరిష్కారానికి 30 లక్షలతో ప్రతిపాదనలు పంపించామని వెల్లడించారు. మహేశ్వరం, కందుకూరు మండలాల్లోని ఎస్టీ తండా గ్రామ పంచాయతీల్లో కమ్యూనిటీ, మహిళా, యువజన సంఘాల వారికి భవనాల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

- Advertisement -

నేడు జరిగే జాబ్‌మేళాలో 3500 ఖాళీలను పూర్తి చేస్తామన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ రఘుమారెడ్డి, వైస్‌ ఎంపీపీ సునిత, సహకార బ్యాంక్‌ చైర్మన్‌ మంచె పాండుయాదవ్‌, ఎంపీడీవో నర్సింహులు, ఎంఈవో కృష్ణయ్య, కోఆప్షన్‌ సభ్యులు ఆధిల్‌అలీ, సర్పంచ్‌లు మెగావత్‌ రాజునాయక్‌, మోతీలాల్‌నాయక్‌, సాలీవీరానాయక్‌, మద్దిసురేఖ కరుణాకర్‌రెడ్డి, థామస్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా నాయకులు యాదయ్య, చంద్రయ్య, డైరెక్టర్లు ప్రభాకర్‌, అశోక్‌కుమార్‌ పాల్గొన్నారు.

నీటి సమస్య పరిష్కారానికి 211 కోట్ల ప్రతిపాదనలు

బడంగ్‌పేట్‌, జూలై 19 : 211 కోట్లతో బడంగ్‌పేట్‌, మీర్‌పేట్‌, జల్‌పల్లి, తుక్కుగూడ మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో నీటి సమస్య పరిష్కారానికి ప్రతిపాదనలు పంపామని, త్వరలోనే టెండర్లు పిలిచి స్వచ్ఛమైన నీటిని అందిస్తామని మంత్రి సబితారెడ్డి తెలిపారు. సోమవారం బడంగ్‌పేట్‌, మీర్‌పేట్‌ కార్పొరేషన్‌ పరిధిలోని వాటర్‌వర్క్స్‌ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఇంటికి నీరు అంది ంచాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్‌ ముందుకు సాగుతున్నారన్నారు. గతంలో నల్లా కనెక్షన్లను తీసుకున్నవారంతా రెగ్యులరైజేషన్‌ చేసుకోవాలని సూచించారు.

ప్రతి ఇంటికి వాటర్‌ మీటర్‌లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ మినరల్‌ వాటర్‌ వాడకుండా మిషన్‌ భగీరథ నీటిని వాడాలని కోరారు. అనంతరం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని మంఖాల్‌, ఇమామ్‌గూడలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. కార్యక్రమంలో బడంగ్‌పేట్‌ మేయర్‌ చిగిరింత పారిజాత, డిప్యూటీ మేయర్‌ ఇబ్రాం శేఖర్‌, మీర్‌పేట్‌ మేయర్‌ దుర్గదీప్‌లాల్‌ చౌహాన్‌, డిప్యూటీ మేయర్‌ తీగల విక్రంరెడ్డి, తుక్కుగూడ మున్సిపల్‌ చైర్మన్‌ కాంటేకర్‌ మధుమోహన్‌, వైస్‌ చైర్మన్‌ భవానీ వెంకట్‌రెడ్డి, వాటర్‌వర్క్స్‌ జీఎం శ్రీనివాస్‌రెడ్డి, కమిషనర్లు కృష్ణమోహన్‌, సుమన్‌రావు, జ్ఞానేశ్వర్‌ కార్పొరేటర్లు, కోఆప్షన్‌ సభ్యులు పాల్గొన్నారు.

నేడు మంత్రి సబితారెడ్డి రాక

కందుకూరు, జూలై 19 : మంత్రి సబితారెడ్డి మంగళవారం కందుకూరుకు వస్తున్నట్లు జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, తహసీల్దార్‌ జ్యోతి సోమవారం తెలిపారు. మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 65 మందికి కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. జడ్పీ చైర్‌పర్సన్‌ అనితారెడ్డి కూడా హాజరవుతారని తెలిపారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
తండాల రూపురేఖలు మారుస్తాం
తండాల రూపురేఖలు మారుస్తాం
తండాల రూపురేఖలు మారుస్తాం

ట్రెండింగ్‌

Advertisement