సబితమ్మకే.. దళిత బహుజనుల మద్దతు
బాలాపూర్‌లో రోడ్ షో కార్యక్రమానికి సోమవారం విచ్చేసిన విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డికి బడంగ్‌పేట డిప్యూటీ మేయర్ ఇబ్రాం శేఖర్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. దళిత బహుజనులంతా సబితమ్మకు మద్దతు తెలుపుతూ భారీ ర్యాలీ నిర్వహించారు.
- డిప్యూటీ మేయర్ ఇబ్రాం శేఖర్ ఆధ్వర్యంలో మంత్రికి ఘన స్వాగతం
- బ్లూ తలపాగాలతో జై భీమ్.. జై సబితమ్మా అంటూ నినాదాలు
- అభివృద్ధికి పట్టం కడుతామని నినాదాలు
- సబితమ్మ గెలుపు కోసం.. శేఖర్ భారీ ర్యాలీ
- బాలాపూర్ రోడ్ షోలో మంత్రికి హారతులు
బడంగ్‌పేట, నవంబర్ 27: బాలాపూర్‌లో రోడ్ షో కార్యక్రమానికి సోమవారం విచ్చేసిన విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డికి బడంగ్‌పేట డిప్యూటీ మేయర్ ఇబ్రాం శేఖర్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. దళిత బహుజనులంతా సబితమ్మకు మద్దతు తెలుపుతూ భారీ ర్యాలీ నిర్వహించారు. బ్లూ తలపాగాలు చుట్టి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదగా గజమాల వేసి అంబేద్కర్‌కు నివాళులర్పించారు. ఇబ్రాం శేఖర్ ఆధ్వర్యంలో భారీగా తరలి వచ్చిన మహిళలు మంత్రికి హారతులు ఇచ్చి ఆశీర్వదించారు. బాలాపూర్ అంతా గులాబీమయంగా మారింది. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ శేఖర్ మాట్లాడుతూ పార్టీలకు సంబంధం లేకుండా డిప్యూటీ మేయర్ కావడానికి పూర్తి స్థాయిలో సహకరించిందన్నారు.
అంత పెద్ద సహాయం చేసిన మంత్రికి ఆమె రుణం తీర్చుకోవాలన్న ఉద్ధేశంతో దళిత బహుజనులంతా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించడానికి తమ వంతు బాధ్యత నెరవేర్చుతామన్నారు. మంచి చేసిన వారిని ఎవరు మర్చి పోకూడదన్నారు. మహేశ్వరం నియోజక వర్గం అభివృద్ధి కావాలంటే మరోసారి సబితా ఇంద్రారెడ్డిని గెలిపించాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. గడిచిన నాలుగున్నర సంవత్సరాల కాలంలో మహేశ్వరం అన్ని విధాలుగా మంత్రి అభివృద్ధి చేశారు కనుకనే అభివృద్ధి చేసిన వారికి పట్టం కట్టాలని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. బలహిన వర్గాలకు న్యాయం జరగాలంటే సబితా ఇంద్రారెడ్డిని గెలిపించాలని ఆయన కోరారు. మాట మీద నిలబడే మంత్రికి ఈనెల 30న కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు లక్ష్మారెడ్డి, గిరీష్, కొప్పుల రాజు, ఎల్లరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, దళిత బహుజన నాయకులు తదితరులు ఉన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

