Minister Ponnam | సిటీబ్యూరో, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ) : కలెక్టరేట్లో గురువారం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ గౌడ్ లు హైదరాబాద్ జిల్లాకు చెందిన 81 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇండ్ల పట్టాలను అందించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా ఇండ్లు కేటాయిస్తామని చెప్పారు.
ప్రతీ నియోజకవర్గంలో పేదలకు అందించే ఇందిరమ్మ ఇండ్ల సర్వే చేసేందుకు అధికారులు వస్తారని సమాచారం అందించాలని సూచించారు. అనంతరం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ మాట్లాడు తూ.. హైదరాబాద్ స్లమ్‌ల్లో ఇందిరమ్మ ఇండ్ల సంఖ్యను పెంచేలా ప్రత్యేక ప్రాధాన్యతనిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే ముఠా గోపాల్ తదితరులు పాల్గొన్నారు.