మేడ్చల్/ మేడ్చల్ రూరల్, జూలై 14: సీఎం కేసీఆర్ హయాంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని, దేశానికి ఆదర్శంగా మారిందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ పాలనలో పల్లె, పట్టణాలు అభివృద్ధిని సాధించాయని అన్నారు. మేడ్చల్ మున్సిపాలిటీ, మేడ్చల్ మండలంలోని పలు గ్రామాలలో మంత్రి మల్లారెడ్డి శుక్రవారం పర్యటించి, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ అభివృద్ధి కేవలం హైదరాబాద్‌కే పరిమితమైందని అన్నారు. పల్లెలతో పాటు పట్టణాలు మౌలిక సదుపాయాలకు దూరంగా ఉండేవన్నారు. పారిశుధ్యం మచ్చుకైనా కన్పించేది కాదన్నారు. రైతుల పరిస్థితి దారుణంగా ఉండేదని, ఎంతో మంది పంటల పండక అప్పుల పాలై, ఆత్మహత్యలు చేసుకున్న విషయం తెల్సిందేనని చెప్పారు. సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టణం, పల్లె అనే తేడా లేకుండా అభివృద్ధి చెందాయని అన్నారు. సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఇంటింటికీ నీళ్లు తదితర మౌలిక సదుపాయాలు సమకూరాయని అన్నారు.
సాగునీటి ప్రాజెక్టులతో బీడు భూములు సస్యశ్యామలం అయ్యాయని, పరిశ్రమలు, ఐటీ అభివృద్ధి ఉపాధి అవకాశాలు మెరుగు పడ్డాయన్నారు. సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలుస్తుందన్నారు. రైతుబీమా, రైతుబంధు, దళితబంధు, ఆసరా పింఛన్లు, కుల వృత్తులకు ప్రోత్సాహం తదితర పథకాలు దేశంలో ఎక్కడా లేవని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటైతే మరింత వెనుకబడిపోతుందంటూ సెటైర్లు వేసిన ఏపీ నాయకులు ఇక్కడి అభివృద్ధి చూసి నోరెళ్లబెడుతున్నారన్నారు. ప్రతి గ్రామంలో వైకుంఠదామాలు, డంపింగ్ యార్డులు, పల్లె ప్రకృతి వనాలు, క్రీడా మైదానాలు ఏర్పాటయ్యాయని, హరితహారంతో పచ్చని పల్లెలుగా మారాయన్నారు. నియోజకవర్గంలో కూడ ప్రణాళికతో అభివృద్దిని చేపట్టామని, గ్రామాల్లో మిగిలిపోయిన పనులను కూడ వెంటనే చేపట్టి ప్రజలకు కష్టాలు లేకుండా చేయడానికే పర్యటన చేస్తున్నట్లు తెలిపారు. మేడ్చల్ పట్టణంలోని 3,7, 8, 11, 22 వార్డుల్లో పూర్తయిన వివిధ అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. మేడ్చల్ మండలంలోని ఎల్లంపేట, సోమారం, సైదోనిగడ్డ తండా, రావల్కోల్ గ్రామాలల్లో శుక్రవారం మంత్రి పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ రజితారాజమల్లారెడ్డి, వైస్ ఎంపీపీ గోపని వెంకటేశ్, జడ్పీటీసీ శైలజావిజయానందరెడ్డి, మున్సిపాలిటీ చైర్పర్సన్ మర్రి దీపికానర్సింహారెడ్డి, వైస్ చైర్మన్ చీర్ల రమేశ్, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు నారెడ్డి నందారెడ్డి, బీఆర్ఎస్ మేడ్చల్ నియోజకవర్గ ఇన్చార్జి మహేందర్‌రెడ్డి, కౌన్సిలర్లు జాకట దేవరాజ్, తుడుం గణేశ్, పెంజర్ల నర్సింహస్వామియాదవ్, సముద్రం సాయికుమార్, బత్తుల శివకుమార్‌యాదవ్, పానుగంటి సుహాసిని, మర్రి శ్రీనివాస్, ఎడ్ల శ్రీనివాస్‌రెడ్డి, జంగ హరికృష్ణ యాదవ్, సాటే మాధవి నరేందర్, కౌడె మహేశ్, కో-ఆప్షన్ సభ్యులు ఆరె గీత, నవీన్‌రెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు శేఖర్‌గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ రామస్వామి ముదిరాజ్, నాయకులు మర్రి నర్సింహారెడ్డి, మద్దుల శ్రీనివాస్‌రెడ్డి, శ్రావణ్‌కుమార్‌గుప్తా, నరేందర్, సత్యనారాయణ, రఫి, సర్పంచ్‌లు వెన్నెల రామకృష్ణుడు, మహేదర్, సుజాత కిషన్, ఎంపీటీసీ కుమార్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దయానంద్ యాదవ్, నాయకులు రాజమల్లారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, సత్యనారాయణ, హరత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పాల్గొన్నారు.