సిటీబ్యూరో/మేడ్చల్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ) : బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడబిడ్డలకు ప్రభుత్వం అందించే బతుకమ్మ చీరల పంపిణీ బుధవారం నుంచి 13వ తేదీ వరకు జరుగనున్నది. ఈ మేరకు జీహెచ్ఎంసీ యూసీడీ విభాగం ఏర్పాట్లు పూర్తి చేసింది. హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా 481 కేంద్రాల్లో 9,40,369 చీరలను ప్రజాప్రతినిధులు పంపిణీ చేయనున్నారు. గోడౌన్ల నుంచి ఆయా సర్కిళ్లలో పంపిణీ చేయనున్న ప్రాంతాలకు ఈ చీరలను తరలిస్తున్నారు.
ఈ మేరకు బతుకమ్మ చీరలను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక కార్పొరేటర్లు పంపిణీ చేయనున్నారు. తెల్లరేషన్‌కార్డు ఉండి, 18 ఏండ్లు పూర్తయిన మహిళలకు వీటిని పంపిణీ చేయనున్నారు. నేతన్నలకు ఉపాధి కల్పించడంతోపాటు ఆడబిడ్డలకు కానుకగా ప్రభుత్వం ప్రతి ఏటా ఆకర్షణీయమైన రంగురంగుల బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే.
బతుకమ్మ కానుకలు
పీర్జాదిగూడ మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్న మంత్రి మల్లారెడ్డి, చిత్రంలో పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్‌రెడ్డి, కార్పొరేటర్లు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 7,24,995 మంది లబ్ధిదారులు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, ఉప్పల్ నియోజక వర్గాలకు చెందిన 7,24,995 మంది ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలను బుధవారం నుంచి పంపిణీ చేయనున్నారు. బుధవారం మేడ్చల్‌లో మంత్రి మల్లారెడ్డి బతుకమ్మ చీరలను పంపిణీ చేయనున్నారు.
నేడు పంపిణీ చేసే కేంద్రాలు
మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా లబ్ధిదారులు