మేడ్చల్/ మేడ్చల్ రూరల్/ జవహర్‌నగర్/ కీసర/ ఘట్కేసర్/ ఘట్కేసర్ రూరల్, అక్టోబర్ 24 : విజయదశమి వేడుకలు నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. నియోజకవర్గంలోని మేడ్చల్, శామీర్‌పేట, మూడుచింతలపల్లి, ఘట్కేసర్, కీసర మండలాలతో పాటు మూడు కార్పొరేషన్లు, ఏడు మున్సిపాలిటీల్లో కన్నులపండువగా నిర్వహించారు. ప్రజలు శమీ వృక్షానికి పూజలు చేసి, పాలపిట్టను దర్శించుకున్నారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకొని, పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా పలు మున్సిపాలిటీల్లో రావణదహనం కార్యక్రమాన్ని నిర్వహించగా, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని వీక్షించారు. మేడ్చల్, గుండ్లపోచంపల్లిలో జరిగిన వేడుకల్లో మంత్రి మల్లారెడ్డి పాల్గొని, రావణ దహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపాలిటీల చైర్పర్సన్లు మర్రి దీపికా నర్సింహా రెడ్డి, లక్ష్మీశ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్లు చీర్ల రమేశ్, ప్రభాకర్, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
వివిధ గ్రామాల్లో నిర్వహించిన వేడుకల్లో ఎంపీపీ రజితా రాజమల్లారెడ్డి, జడ్పీటీసీ శైలజా రెడ్డి, వైస్ ఎంపీపీ వెంకటేశ్, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు విజయానందారెడ్డి, సర్పంచులు గీతాభాగ్యారెడ్డి, నర్మదా గోపాల్‌రెడ్డి, బాబు యాదవ్, మాంగ్యా నాయక్, నాయకులు పాల్గొన్నారు. జవహర్‌నగర్ కార్పొరేషన్లో జరిగిన వేడుకల్లో మేయర్ మేకల కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఘట్కేసర్ మండల పరిధిలోని పలు గ్రామాల్లో నిర్వహించిన వేడుకల్లో సర్పంచ్‌లు కావేరి, జలజ, గోపాల్ రెడ్డి, సురేశ్, వెంకటేశ్ గౌడ్, వెంకట్ రెడ్డి, రమాదేవి, శివశంకర్, గీత శ్రీనివాస్, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.