బాలానగర్, అక్టోబర్ 31 : కూకట్పల్లి నియోజకవర్గంలో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. ఓల్డ్‌బోయిన్‌పల్లి డివిజన్ బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థిగా గత ఎన్నికల్లో పోటీ చేసిన ఏనుగుల తిరుపతి మంగళవారం కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్ ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. దీంతో ఓల్డ్‌బోయిన్‌పల్లి డివిజన్లో బీజేపీ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలినైట్లెంది. మంత్రి కేటీఆర్ తిరుపతికి బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
బీజేపీ మేడ్చల్ జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడిగా కూడా ఏనుగుల తిరుపతి పని చేశారు. తిరుపతి 2019 నుంచి బీజేపీలో చేరి ఓల్డ్‌బోయిన్‌పల్లి డివిజన్ బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి ముద్దం నర్సింహయాదవ్ చేతిలో పరాజయం పాలయ్యారు. తిరుపతి బీఆర్ఎస్లో చేరడంతో బీఆర్ఎస్కు కొంత బలం చేకూరినట్లు అయింది.