హైదరాబాద్ : ఖాజాగూడ లేక్ రోడ్ హైదరాబాద్ హైటెక్‌ను చూపిస్తోందని ఓ బుడ్డోడు ప్రశంసలు కురిపించారు. ఈ లేక్‌ను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకున్న మంత్రి కేటీఆర్‌కు తనీష్ అనే పిల్లాడు.. ట్విట్టర్ వేదికగా థాంక్యూ చెప్పాడు. వీకెండ్ సాయంత్రాల్లో ఈ రోడ్‌పై వాహనాలను నిషేధిస్తే.. పిల్లలు ఫ్రీగా వాకింగ్ చేసుకుంటారని తనీష్ కేటీఆర్‌ను అభ్యర్థించాడు.
ఈ ట్వీట్‌పై మంత్రి కేటీఆర్ స్పందించారు. హేయ్ తనీష్.. నీ మంచి మాటలకు థాంక్స్ చెప్తున్నానని కేటీఆర్ పేర్కొన్నారు. కుటుంబాలు, పిల్లల కోసం ఆ రోడ్‌తో పాటు చెరువును కూడా మరింత అందంగా తీర్చిదిద్దాలనుకుంటున్నామని తెలిపారు. ఈ పనులపై అధికారులు చర్యలు చేపట్టారని, వీకెండ్స్‌లో ఏదైనా ప్రత్యేక కార్యక్రమాలకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు.
Hey Tanish,
Thanks for the kind words. We want to make this road and the adjoining lake even more beautiful place for families and kids to hang out@ZC_SLP is working on it and hopefully we can do something in the lines of an exclusive event for weekends https://t.co/kIMdLOx3Pa
— KTR (@KTRTRS) April 15, 2022