మోక్షజ్ఞ తెరంగేట్రానికి మోక్షం?
కొన్ని నెలల క్రితం నందమూరి మోక్షజ్ఞ తొలి సినిమా ఓపెనింగ్ అంటూ హడావిడి చేసి, ఉన్నట్టుండి వాయిదా వేశారు. దానికి ఫిల్మ్ సర్కిల్స్‌లో రకరకాల కారణాలు వినిపించాయి.
కొన్ని నెలల క్రితం నందమూరి మోక్షజ్ఞ తొలి సినిమా ఓపెనింగ్ అంటూ హడావిడి చేసి, ఉన్నట్టుండి వాయిదా వేశారు. దానికి ఫిల్మ్ సర్కిల్స్‌లో రకరకాల కారణాలు వినిపించాయి. తొలి సినిమా డైరెక్టర్ అనుకున్న ప్రశాంత్‌వర్మ కూడా ఈ ప్రాజక్ట్ నుంచి తప్పుకున్నారు. దీంతో మోక్షజ్ఞ తెరంగేట్రం వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. మరోవైపు అభిమానులేమో బాలయ్య నటవారసుడి ఆగమనం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యం ఎట్టకేలకు మోక్షజ్ఞ సినిమాకి రంగం సిద్ధమైనట్టు తెలుస్తున్నది.
బాలకృష్ణ క్లాసిక్ ‘ఆదిత్య 369’కు సీక్వెల్‌గా రూపొందనున్న ‘ఆదిత్య 999 మ్యాక్స్’ చిత్రం ద్వారా మోక్షజ్ఞ హీరోగా పరిచయం కానున్నారు. బాలకృష్ణే ఈ చిత్రానికి కథ అందించడం విశేషం. జాగర్లమూడి రాధాకృష్ణ(క్రిష్) ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్టు సమాచారం. స్క్రిప్ట్ వర్క్ కూడా మొదలైందట. సాయిమాధవ్ బుర్రా ఈ సినిమాకు మాటలు రాస్తున్నట్టు వినికిడి. ఈ నెల చివరిలో ఈ సినిమా పూజా కార్యక్రమాలు లాంఛనంగా జరుగనున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

