విజయం కోసం పరాజయాలతో యుద్ధం చేస్తున్నారు బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్. ఆయన రీసెంట్ సినిమా ‘సికిందర్’ కూడా బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది. ప్రస్తుతం ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ సినిమా చేస్తూ బిజీగా ఉన్నారు సల్మాన్. 2020లో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణ నేపథ్యంతో రూపొందుతున్న ఈ చిత్రానికి అపూర్వ లాఖియా దర్శకుడు. ఈ ఏడాది ఏప్రిల్ 17న ఈ సినిమా విడుదల కానున్నది. ప్రస్తుతం సల్మాన్ ఆశలన్నీ ఈ సినిమాపైనే. ఇదిలావుంటే.. పనిలోపనిగా తన తర్వాత సినిమాను కూడా లైన్లో పెట్టేస్తున్నారు సల్మాన్‌ఖాన్.
ఈ తాజా చిత్రాన్ని దర్శక ధ్వయం రాజ్-డీకే తెరకెక్కించనున్నట్టు బాలీవుడ్ న్యూస్. సల్మాన్ కోసం వీరు ఓ కథ తయారు చేశారట. స్టోరీ లైన్ సల్మాన్‌కి కూడా బాగా నచ్చిందట. రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఈ సినిమా ఉంటుందని సమాచారం. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్టు తెలిసింది. జూలై నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సివుంది.