ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకే ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లు : మంత్రి కేటీఆర్
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రొగ్రాం (ఎస్ఆర్డీపీ)లో మరో రెండు కీలక ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చాయి. ఎల్బీనగర్ చౌరస్తాలో ఇన్నర్‌రింగ్‌రోడ్డు మార్గంలో రూ.9.28 కోట్లతో నిర్మించిన అండర్‌పాస్ (కుడివైపు), రూ. 28.642 కోట్లతో బైరామల్‌గూడ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లైఓవర్ ను రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఎల్బీనగర్ పర్యటనలో భాగంగా నాగోల్, బండ్లగూడలో నాలా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహముద్ అలీతో పాటు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. వర్షాలు, వరదల వల్ల ఎల్బీనగర్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని తెలిపారు. రూ. 2,500 కోట్లతో ఎల్బీనగర్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టామని పేర్కొన్నారు. ఈ క్రమంలో వరద ముంపు నివారణకు రూ. వెయ్యి కోట్లతో నాలాల అభివృద్ధి పనులు చేపట్టామని పేర్కొన్నారు. ఎల్బీనగర్ పరిధిలో మంచి నీటి సమస్యను పరిష్కరించేందుకు 12 రిజర్వాయర్లు నిర్మించామన్నారు. 353 కిలోమీటర్ల మేర వాటర్ పైపులైన్లు వేశామన్నారు. ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌ల నిర్మాణం చేపట్టినట్లు స్పష్టం చేశారు. గడ్డి అన్నారం మార్కెట్ స్థలంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మిస్తామన్నారు. ఎల్బీనగర్లో భూ రిజిస్ట్రేషన్ సమస్య కూడా పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు. కొత్త పెన్షన్లు 2 నుంచి 3 నెలల్లో అందజేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు.
Under the ongoing Strategic Road Development Program (SRDP), the Govt. of Telangana has constructed an Underpass at LB Nagar junction and the Left Hand Side (LHS) Flyover at Bairamalguda Junction. These structures were inaugurated by Ministers @KTRTRS, and @SabithaindraTRS today. pic.twitter.com/FTMJWj3Cap
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) March 16, 2022
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gautam Prasad | ‘పెండింగ్‌లో రూ.4 వేల కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. ఎంపీ వంశీకృష్ణ నీకు దమ్ముంటే ప్రజలకు సమాధానం చెప్పు’
Ranabaali | టికెట్ రేట్ల పెంపుపై విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం?.. ఇకపై ఆ ప్రసక్తే లేదట!
Medical Tests | ప్రతి ఒక్కరు తరచూ చేయించుకోవాల్సిన ముఖ్యమైన వైద్య పరీక్షలు ఇవే..
‘బీఆర్ఎస్ నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సమావేశాన్ని జయప్రదం చేయండి’
women cops detain Dipke | అభిజిత్ దీప్కే బృందాన్ని అదుపులోకి తీసుకున్న మహిళా పోలీసులు.. వారినే ఎందుకు మోహరించారంటే?
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

