Minister KTR | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో తెలంగాణ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ కూలింగ్ అండ్ కోల్డ్‌చైన్ సెంటర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్సెక్రటరీ జయేశ్‌రంజన్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, జీఎంఆర్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఆహారం, వ్యాక్సిన్లను భద్రపరచడంలో ఈ కోల్డ్ చైన్ ఎంతగానో ఉపయోగపడనుంది. పరిశోధనల పరంగా వర్సిటీ ఆఫ్ బర్మింగ్‌హోమ్ సహాయం అందించనుంది.
ఈ కోల్డ్‌చైన్ సెంటర్‌ను ప్రారంభించిన అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఇలాంటి కూలింగ్ సొల్యూషన్స్ దేశంలో ఇంకా చాలా కావాలని తెలిపారు. ప్రపంచానికి నేడు హైదరాబాద్ నుంచి వ్యాక్సిన్లు సరఫరా చేస్తున్నామని తెలిపారు. ఫేస్‌వన్‌లో ఈ కేంద్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. అనంతరం అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో నిజామాబాద్ పర్యటనకు బయల్దేరి వెళ్లారు.
Telangana Launches Another First-of-its-Kind Initiative
IT and Industries Minister @KTRBRS inaugurates Telangana Centre of Excellence for Sustainable Cooling and Cold Chain at GMR Innovex Campus near GMR Airport, Hyderabad.
This novel initiative:
✅ Promotes sustainable cooling… pic.twitter.com/iM7I9GAgg7— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) August 9, 2023