Pathang | పతంగుల పోటీ నేపథ్యంతో రూపొందుతున్న కామెడీ స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘పతంగ్’ (Pathang) త్వరలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. సినిమాటిక్ ఎలిమెంట్స్ అండ్ రిషన్ సినిమాస్ బ్యానర్‌పై విజయ్ శేఖర్ అన్నే, సంపత్, సురేష్ కొత్తింటి, నాని బండ్రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు సమర్పిస్తున్నారు.ఇన్స్టాగ్రామ్ సెన్సేషన్ ప్రీతి పగడాల, జీ సరిగమప రన్నర్అప్ ప్రణవ్ కౌశిక్, వంశీ పూజిత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వీరితో పాటు ప్రముఖ గాయకుడు ఎస్.పి.చరణ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
డి. సురేష్ బాబు సమర్పణలో మా సినిమా రిలీజ్ కావడం ఎంతో ఆనందంగా ఉంది అని నిర్మాతలు అంటున్నారు. థియేటర్లలో యూత్ ఫెస్టివల్‌లా ఈ సినిమా ఉంటుంది. కొత్తవాళ్లతో చేసిన సినిమా అయినప్పటికీ, క్వాలిటీ విషయంలో ఎలాంటి రాజీ లేదు. కలర్‌ఫుల్ విజువల్స్‌తో పాటు ఈ సినిమాకు కథే హీరో. సంగీత దర్శకుడు జోస్ జిమ్మి అందించిన పాటలు అద్భుతంగా ఉన్నాయి. పాటలు వింటూనే పాజిటివ్ వైబ్స్ వస్తాయి. సినిమా చూస్తున్నంత సేపు తంగుల పోటీ ప్రేక్షకుల్లో ఉత్సుకతను పెంచుతుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా తప్పకుండా అలరిస్తుందనే నమ్మకం మాకు ఉంది అని తెలిపారు.
యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునే వినూత్న కథాంశంతో రూపొందిన ‘పతంగ్’ ఈ డిసెంబర్లో థియేటర్లలో ఓ పండుగ వాతావరణాన్ని తీసుకొస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.మరి కొద్ది రోజులలో విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. తాజాగా మూవీ ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఆసక్తిని పెంచుతుంది. మరి ఈ ట్రైలర్ మీరు చూసి ఎంజాయ్ చేయండి.