Manoj Bajpayee | ఇండియన్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు మనోజ్ బాజ్పేయీ. భాషా భేదాలు లేకుండా హిందీ, తెలుగు సహా పలు భాషల్లో విభిన్నమైన పాత్రలు చేస్తూ హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. ఇటీవల ఆయన నటించిన ‘ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3’, ‘ఇన్స్పెక్టర్ జెండే’ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ‘పోలీస్ స్టేషన్ మైన్ భూత్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు మనోజ్ బాజ్పేయీ. ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది.ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మనోజ్ బాజ్పేయీ తన కెరీర్, బాలీవుడ్ పరిస్థితులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సినీ ఇండస్ట్రీలో ఒక నటుడు తన స్థానాన్ని నిలబెట్టుకోవడం అంత ఈజీ కాదు. ఎప్పటికప్పుడు తనను తాను ప్రూవ్ చేసుకుంటూనే ఉండాలి. ఒక సినిమా హిట్ అయిందని రిలాక్స్ అయ్యే అవకాశం లేదు. మరో అవకాశం వస్తుందా లేదా అనే ఆలోచన ఎప్పుడూ మనసులో తిరుగుతూనే ఉంటుంది. మిగతా వాళ్ల గురించి నాకు తెలియదు కానీ, నేను మాత్రం అలాగే ఆలోచిస్తాను. ఇక్కడ విజయం ఉంటేనే అవకాశాలు. లేదంటే, మెల్లగా ఆ నటుడు తన ఉనికిని కోల్పోతాడు” అని అన్నారు.అంతేకాదు, బాలీవుడ్లో పెరుగుతున్న అభద్రతపై కూడా ఆయన స్పందించారు. “బాలీవుడ్లో ఒకరినొకరు ప్రశంసించుకునే సంస్కృతి తగ్గిపోయింది. ఎవరు ఎవరిని మెచ్చుకోరు. కనీసం ఫోన్ చేసి అయినా ప్రశంసించరు. ఇక్కడ అభద్రత భావం బాగా పెరిగిపోయింది. అయినప్పటికీ నేను మాత్రం మంచి పాత్రల కోసం అందరికీ కాల్స్ చేస్తూనే ఉంటాను. నా సినిమాల గురించి ప్రేక్షకులను కూడా అడిగి తెలుసుకుంటాను” అని మనోజ్ బాజ్పేయీ తెలిపారు.
మనోజ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఒక వైపు స్టార్డమ్ ఉన్నా, మరోవైపు నటుడిగా నిరంతరం తనను తాను నిరూపించుకోవాల్సిన పరిస్థితిపై ఆయన నిజాయితీగా మాట్లాడారని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.