Hyderabad | ఇద్దరి మధ్య గొడవను ఆపేందుకు వెళ్లి.. హత్యకు గురయ్యాడు
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో (Hyderabad) హత్యలు నిత్యకృత్యమయ్యాయి. ప్రతి రోజూ నగరంలో ఏదో ఒక మూలన హత్యలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా టోలిచౌకి (Tolichowki) పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో (Hyderabad) హత్యలు నిత్యకృత్యమయ్యాయి. ప్రతి రోజూ నగరంలో ఏదో ఒక మూలన హత్యలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా టోలిచౌకి (Tolichowki) పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఇద్దరి మధ్య జరుగుతున్న గొడవను ఆపేందుకు వెల్లిన యువకుడినికి కత్తితో పొడిచి చంపేశారు. దీంతో ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
ఇర్ఫాన్ (24) సోదరుడు అద్నాన్, బిలాల్ మధ్య టోలిచౌకిలోని పారామౌంట్ కాలనీ గేట్ నంబర్ 4 సమీపంలో ఆదివారం రాత్రి ఘర్షణ చోటుచేసుకున్నది. విషయం తెలుసుకున్న ఇర్ఫాన్ అక్కడికి వెళ్లి.. వారిద్దరి మధ్య గొడవను ఆపేందుకు ప్రయత్నించాడు. దీంతో ఇర్ఫాన్‌పై బిలాల్లో కత్తితో దాడిచేశాడు. తీవ్రంగా గాయపడిన అతడిని దవాఖానకు తరలించేలోపే మరణించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి, ఘర్షణకు గల కారణాలపై ఆరాతీస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

