KTR | హైదరాబాద్ : ఎకో ఫ్రెండ్లీ మట్టి గణపతి విగ్రహాల ఉచిత పంపిణీని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 5 లక్షల ఎకో ఫ్రెండ్లీ మట్టి గణపతి విగ్రహాల ఉచిత పంపిణీ చేపట్టారు. 150 వార్డు కార్యాలయాలు, 50 ప్రాంతాల్లో మట్టి గణపతులను పంపిణీ చేయనున్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్పల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, అర్బన్ డెవలప్మెంట్ సెక్రటరీ అరవింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్తో పాటు పలువురు పాల్గొన్నారు.
Distribution of 5 lakhs Eco friendly “Mitti Ganesha” on free of cost basis commenced today by minister @KTRBRS – they will be available at 150 ward offices of @GHMCOnline & another 50+ locations by @HMDA_Gov pic.twitter.com/iZ0fVvNwV2
— Arvind Kumar (@arvindkumar_ias) September 14, 2023