Dhurandhar | బాలీవుడ్లో సంచలన విజయం సాధించిన ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. స్టార్ హీరో రణవీర్ సింగ్ కథానాయకుడిగా నటించిన ఈ యాక్షన్–ఎంటర్టైనర్, విడుదలైనప్పటి నుంచి అంచనాలను మించి వసూళ్లు రాబడుతూ రికార్డులు సృష్టిస్తోంది. సినిమా రిలీజ్ అయిన తర్వాత రెండో శనివారం ఒక్కరోజులోనే రూ.55 కోట్ల నెట్ కలెక్షన్ సాధించి, హిందీ చిత్ర పరిశ్రమలో అరుదైన ఘనతను నమోదు చేసింది.ఇప్పటివరకు ఈ సినిమా మొత్తం రూ.300 కోట్ల నెట్ కలెక్షన్లు దాటడం విశేషం. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తే, ‘ధురంధర్’ ఈ ఏడాది బాలీవుడ్లో టాప్ గ్రాసర్లలో ఒకటిగా నిలవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. యాక్షన్ సీక్వెన్సులు, రణవీర్ సింగ్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్, కథలోని ఇంటెన్స్ ఎలిమెంట్స్ సినిమాకు ప్రధాన బలంగా మారాయి.
చిత్రం భారీ విజయం నేపథ్యంలో ఇప్పుడు మరో ఆసక్తికరమైన టాక్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అదేంటంటే… ‘ధురంధర్’ సినిమా తెలుగులోనూ విడుదల కానుందన్న వార్తలు. ఇప్పటికే పాన్ ఇండియా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని, మేకర్స్ తెలుగు వెర్షన్‌పై ఫోకస్ పెట్టినట్లు సమాచారం. రణవీర్ సింగ్‌కు తెలుగులోనూ మంచి ఫ్యాన్ బేస్ ఉండటంతో, ఈ యాక్షన్ ఎంటర్టైనర్కు ఇక్కడ కూడా మంచి ఆదరణ లభిస్తుందని అంచనా వేస్తున్నారు.తెలుగు డబ్బింగ్ వెర్షన్ విడుదల తేదీపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. అయితే త్వరలోనే మేకర్స్ క్లారిటీ ఇవ్వనున్నారని, భారీగా ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా డబ్బింగ్, మ్యూజిక్ ప్రమోషన్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని సమాచారం.
మొత్తానికి, బాలీవుడ్లో ఇప్పటికే సంచలన విజయాన్ని నమోదు చేసిన ‘ధురంధర్’, తెలుగు వెర్షన్‌తో మరింత పెద్ద స్థాయిలో సక్సెస్‌ను సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రణవీర్ సింగ్ కెరీర్లో మరో మైలురాయిగా నిలిచిన ఈ సినిమా, పాన్ ఇండియా స్థాయిలో ఎంతటి ప్రభావం చూపిస్తుందో చూడాలి.ఈ చిత్రం పుష్ప2 రికార్డ్స్ కూడా బ్రేక్ చేసిందని అంటున్నారు.