KTR | బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నందు బిలాల్‌ను అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపిస్తే గోషామహల్ నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. నియోజవర్గం పరిధిలో కేటీఆర్ రోడ్‌షో నిర్వహించారు. రోడ్‌షోకు వేలాది మంది హాజరవగా కేటీఆర్ తన ప్రసంగంతో వారిలో జోష్ నింపారు. బేగంబజార్ ఛెత్రిలో మాట్లాడారు. గోషామహల్‌ను గచ్చిబౌలి తరహాలో మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామన్నారు. పదేళ్లుగా ఎమ్మెలేగా ఉన్న రాజాసింగ్ భారతదేశాన్ని హిందూదేశంగా చేద్దామంటూ నియోజకవర్గాన్ని గాలికి వదిలేశాడని విమర్శించారు.
బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయిస్తామన్నారు. గండిపేటకు గోదావరి జలాలు తీసుకొని మూసినదిగుండా పారిస్తామన్నారు. రాజాసింగ్ హిందువునంటూ రాజకీయం చేస్తారన్నారు. సీఆర్ పెద్ద హిందువు కానీ రాజకీయం చేయరన్నారు. గోషామహల్లో అనేక కులమతాల వారని, అన్నిరాష్ట్రాల ప్రజలు ఇక్కడ ఉంటారన్నారు. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. మార్వాడీలు ఒక్కసారి మీ సామాజిక వర్గానికి చెందిన బిలాల్‌ను గెలిపించాలన్నారు. పదేళ్లు బీజేపీకి, కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చారన్నారు. ఒక్కసారి బీఆర్ఎస్కు ఇచ్చి చూడాలన్నారు. నందు బిలాల్ 25 సంవత్సరాలుగా నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు చేశారన్నారు. కోవిడ్ సమయంలో ఎంతో మందికి తన సేవలు కూడా అందించారన్నారు.
కేసీఆర్ బిలాల్ సేవా కార్యక్రమాలను చూసి అతనికి ఎమ్మెల్యే అభిర్తిగా మీ ముందుంచారన్నారు. తెలంగాణ మూడోసారి ప్రభుత్వం వచ్చినక మేం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్నారు. రూ.400కే సిలిండర్, తెల్లరేషన్ కార్డుదారులకు సన్నబియ్యం సౌభాగ్యలక్ష్మి ద్వారా మహిళలకు రూ.3వేలు ఇస్తామన్నారు. కాంగ్రెస్, బీజేపీ రెండు ఒకటేనన్నారు. కోహ్లీ సెంచరీ కొట్టినట్లు బీఆర్ఎస్ సెంచరీ కొట్టాలంటే నందు బిలాల్ గెలవాలన్నారు. అమిత్‌షా డబుల్ ఇంజిన్ అంటారని.. మరి గోషామహల్లో కూడా బీఆర్ఎస్ను గెలిపించి డబుల్ ఇంజిన్ సర్కారు చేయాలన్నారు. 3న తారీఖున నందు బిలాల్‌ను గోషామహల్‌ను దత్తత తీసుకుంటామన్నారు.