e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, May 9, 2021
Home హైదరాబాద్‌ అన్ని వర్గాల మద్దతు వాణీదేవికే..

అన్ని వర్గాల మద్దతు వాణీదేవికే..

అన్ని వర్గాల మద్దతు వాణీదేవికే..
  • రామచందర్‌రావు గ్రాడ్యుయేట్లకే చేసిందేంటి..?    
  • కాంగ్రెస్‌ కహానీ ఖతం…టీడీపీ నామ్‌కేవాస్తే.. 
  • ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి హరీశ్‌రావు 

మల్కాజిగిరి, మార్చి 4: పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సురభివాణీదేవికి రోజురోజుకు  అన్ని వర్గాల సంపూర్ణ మద్దతు పెరుగుతుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్పష్టం చేశారు. గురువారం మల్కాజిగిరి నియోజకవర్గ పార్టీ కార్యకర్తలు, నాయకుల సన్నాహక సమావేశం ఎమ్మెల్యే హన్మంతరావు అధ్యక్షతన ఆనంద్‌బాగ్‌లోని బృందావన్‌ గార్డెన్స్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ కహానీ ముగిసిందని, టీడీపీ నామ్‌కేవాస్తే ఉందన్నారు. గ్రాడ్యుయేట్లకు, అడ్వకేట్లకు బీజేపీ ఏం చేసిందని ఓటు అడుగుతున్నారని ప్రశ్నించారు. ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతూ కొత్త ఉద్యోగాలు ఇవ్వనందుకా, ఐటీఆర్‌ను వెనక్కి తీసుకున్నదుకా..ఎల్‌ఐసీని, రైల్వే, విశాఖ ఉక్కు ప్యాక్టరీలను ప్రైవేటు పరం చేసే ఆలోచన ఉన్నందుకా మీకు ఓటు వేయాలా అని ప్రశ్నించారు. గతంలో బీజేపీ ఎమ్మెల్సీగా గెలిచిన  రామచందర్‌రావు ఎమ్మెల్సీగా ఉన్న సమయంలోనే ఒకసారి ఎంపీకి, మరోసారి ఎమ్మెల్యేకి పోటీ చేశావు. అంటే నీకు గ్రాడ్యుయేట్లంటే అంత చిన్నచూపా అని అన్నారు. మళ్లీ ఇప్పుడు ఎమ్మెల్సీగా ఏ మొఖం పెట్టుకొని ఓట్లు అడుగుతావని ప్రశ్నించారు.

 టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అడ్వకేట్లను  రూ. 25 కోట్ల ప్యాకేజీ ప్రకటించిందన్నారు. గ్రాడ్యుయేట్లందరూ సురభివాణీకి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. అనంతరం  రాజ్యసభ సభ్యులు  కేకే మాట్లాడుతూ  గ్రాడ్యుయేట్లు, విద్యావంతులు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మాట్లాడుతూ మల్కాజిగిరి నియోజకవర్గంలో సురభివాణీ దేవికి అత్యధిక మెజార్టీ ఇచ్చేందుకు ప్రతి ఒక్కరూ శ్రమించాలని సూచించారు.  కార్యక్రమంలో ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, మాజీ మేయర్‌ రాంమ్మెహన్‌, కార్పొరేటర్లు ప్రేంకుమార్‌, సునీతరాముయాదవ్‌, మీనా ఉపేందర్‌రెడ్డి, శాంతిశ్రీనివాస్‌రెడ్డి, రాజ్‌జితేంద్రనాథ్‌, సబితాకిషోర్‌, నాయకులు మహేశ్‌ముదిరాజ్‌, పరశురాంరెడ్డి, పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శి సతీష్‌కుమార్‌,  నిరంజన్‌, రాముయాదవ్‌, లక్ష్మీకాంత్‌రెడ్డి, అమీనుద్దీన్‌ , మాజీ కార్పొరేటర్‌ ఎన్‌. జగదీశ్‌గౌడ్‌తో పాటు మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

పట్టభద్రుల సమస్యలు తెలిసిన వ్యక్తి వాణీదేవి

బడంగ్‌పేట,మార్చి4: పట్టభద్రుల సమస్యలు తెలిసిన వ్యక్తి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభివాణీదేవి అని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. బడంగ్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని రోమా ఇన్‌క్లేవ్‌, గడ్డం ఇన్‌క్లేవ్‌ కాలనీలో గురువారం కాలనీ అసోసియేషన్‌ నాయకులు, కాలనీవాసులతో సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి  మాట్లాడుతూ ఎమ్మెల్సీగా సురభివాణీదేవిని గెలిపించి సీఎం కేసీఆర్‌కు గిఫ్ట్‌ ఇవ్వాలన్నారు. గతంలో బీజేపీ నుంచి గెలిచిన వ్యక్తి ఇక్కడి ప్రజలకు ఎంచేశారని ఆమె ప్రశ్నించారు.  కార్యక్రమంలో మేయర్‌ పారిజాత నర్సింహారెడ్డి, కార్పొరేటర్లు సుదర్శన్‌ రెడ్డి, స్వప్నజంగారెడ్డి, పార్టీ బడంగ్‌పేట కార్పొరేషన్‌ అధ్యక్షుడు రాంరెడ్డి, కాలనీ అసోసియేషన్‌ నాయకులు, కాలనీ వాసులు  పాల్గొన్నారు. 

కార్యకర్తలు పట్టభద్రులను కలువాలి

హయత్‌నగర్‌/మన్సూరాబాద్‌/ఎల్బీనగర్‌, మార్చి 4: హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సురభివాణీదేవిని గెలిపించి స్వర్గీయ ప్రధాని పీవీ నర్సింహారావుకు ఘనమైన నివాళి అర్పించాలని ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే, ఎంఆర్‌డీసీ చైర్మన్‌ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. గురువారం కొత్తపేటలోని రాజధాని గార్డెన్స్‌లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హయత్‌నగర్‌ డివిజన్‌ పరిధిలోని మైత్రీ మధుర కాలనీలో, కొత్తపేట డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు లింగాల రాహుల్‌గౌడ్‌,మన్సూరాబాద్‌ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ మహిళా విభాగం అధ్యక్షురాలు ధనలక్ష్మి, ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పట్టభద్రుల సమావేశంలో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఎమ్మెల్సీలు దయానంద్‌, యెగ్గె మల్లేశం, రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్‌  లక్ష్మీనారాయణ, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ ఒంటేరు ప్రతాప్‌రెడ్డి, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా పాల్గొన్నారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు ప్రతి పట్టభద్రున్ని  కలిసి టీఆర్‌ఎస్‌కు ఓటు వేసేలా చొరవ తీసుకోవాలన్నారు.కార్యక్రమంలో సీనియర్‌ నాయకులు నాగేశ్వర్‌రావు, ప్రకాశ్‌గౌడ్‌, శరత్‌చంద్ర, మ న్సూరాబాద్‌ డివిజన్‌ నాయకులు వెంకట్‌రెడ్డి, సతీ ష్‌, రాజిరెడ్డి, సతీష్‌రెడ్డి, విజయలక్ష్మి, నీరజ, పద్మ, లీలావతి, కవిత,యత్‌నగర్‌ డివిజన్‌ మాజీ కార్పొరేటర్‌ సామ తిరుమల్‌రెడ్డి, డివిజన్‌ అధ్యక్షుడు మల్లేశ్‌ ముదిరాజ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు. 

Advertisement
అన్ని వర్గాల మద్దతు వాణీదేవికే..
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement