100 పడకల ప్రభుత్వ వైద్యశాలకు నేడు భూమిపూజ : మంత్రి హరీశ్‌రావు
కేపీహెచ్‌బీ కాలనీ 5వ ఫేజ్‌లో 100 పడకల ప్రభుత్వ వైద్యశాల నిర్మాణ పనులకు శనివారం ఉదయం 8 గంటలకు భూమిపూజ నిర్వహించడం జరుగుతుందని నియోజకవర్గం కోఆర్డినేటర్ సతీశ్అరోరా తెలిపారు.
- నేడు కేపీహెచ్‌బీ కాలనీలో వైద్యశాలకు మంత్రి హరీశ్‌రావు భూమిపూజ
కేపీహెచ్‌బీ కాలనీ, జూన్ 9 : కేపీహెచ్‌బీ కాలనీ 5వ ఫేజ్‌లో 100 పడకల ప్రభుత్వ వైద్యశాల నిర్మాణ పనులకు శనివారం ఉదయం 8 గంటలకు భూమిపూజ నిర్వహించడం జరుగుతుందని నియోజకవర్గం కోఆర్డినేటర్ సతీశ్అరోరా తెలిపారు. కేపీహెచ్‌బీ కాలనీలో 40 ఏండ్ల ప్రజల కల ప్రభుత్వ వైద్యశాల నిర్మాణమని, ఎమ్మెల్యే కృష్ణారావు కృషి ఫలితంగా ఇన్నేండ్లకు వైద్యశాల నిర్మాణ పనులు ప్రారంభమవుతున్నట్లు తెలిపారు. సుమారు రూ.68 కోట్లతో సకల హంగులతో ప్రభుత్వ వైద్యశాల నిర్మాణ అవుతుందన్నారు.
రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖామంత్రి తన్నీరు హరీశ్‌రావు, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ కుర్మయ్యగారి నవీన్‌కుమార్, కేపీహెచ్‌బీ కాలనీ కార్పొరేటర్ మందడి శ్రీనివాస్‌రావు చేతుల మీదుగా భూమిపూజ జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కేపీహెచ్‌బీ కాలనీతోపాటు కూకట్పల్లి నియోజకవర్గంలోని ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

