అమీర్‌పేట్, ఏప్రిల్ 9: ఉద్యోగ నియామకాలకు యువత సన్నద్ధం కావాలని మంత్రి గంగుల కమలాకర్ సూచించారు. శుక్రవారం అమీర్‌పేట్‌లో నిర్వహించిన రూట్స్ కళాశాల స్నాతకోత్సవంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. ఒకనాడు ఉపాధి అవకాశాల కోసం వలసదారి పట్టిన తెలంగాణ.. నేడు సీఎం కేసీఆర్ సారథ్యంలో విస్తృత ఉపాధి అవకాశాలను అందిస్తున్న రాష్ట్రంగా ఎదిగిందని పేర్కొన్నారు. అనంతరం 300 మంది కళాశాల విద్యార్థులకు డిగ్రీ పట్టాలు అందజేశారు. రూట్ కొలీజియం వ్యవస్థాపకుడు భిక్షపతి, ఇక్ఫాయ్ డైరెక్టర్ సుధాకర్‌రావు, ప్రొఫెసర్ లింబాద్రి పాల్గొన్నారు.