హైదరాబాద్ : టీ న్యూస్ కార్యనిర్వాహక సంపాదకుడు సోమా సురేష్ బాబు తల్లి సోమా రామమణి ఇటీవల మృతిచెందారు. రామమణి దశదిన కర్మ కోహెడ క్రాస్ రోడ్డులో గల ఎస్వైఆర్ గార్డెన్స్ లో బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ, మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదన చారి, రాష్ట్ర దివ్యాంగుల సంస్థ చైర్మన్ వాసుదేవ రెడ్డి, పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్, బీసీ కమిషన్ సభ్యుడు కిషోర్, ఎమ్మెల్సీలు నవీన్ రావు, రవీందర్ రావు, ఐటీ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ రాకేష్, కేశవ్ తదితరులతో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు. ఈ సందర్భంగా రామమణి చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. సురేష్ ని ఓదార్చి తమ ప్రగాఢ సంతాపాన్ని, తెలియజేశారు.