హైదరాబాద్ : జూన్ 22 – 23 తేదీలలో నిజామాబాద్ పట్టణంలో ‘ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ తెలంగాణ స్టేట్ బ్రాంచ్’ ఆధ్వర్యంలో ‘అడిక్షన్ సైకియాట్రీ’(Addiction Psychiatry) పై జాతీయ స్థాయిలో సదస్సు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన బ్రోచర్‌ను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ (Damodara Rajanarsimha) హైదరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. డ్రగ్స్ మహమ్మారి నిర్మూలనపై యువతలో సామాజిక చైతన్యం, అవగాహన కల్పించడానికి నిజామాబాద్‌లో ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ తెలంగాణ స్టేట్ చాప్టర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి సదస్సు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. సదస్సు నిర్వాహకులను మంత్రి ఈ సందర్భంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ తెలంగాణ స్టేట్ బ్రాంచ్ జనరల్ సెక్రటరీ డా. విశాల్ ఆకుల, ఎర్రగడ్డ మానసిక వైద్యశాల సూపరింటెండెంట్ డా. ఎం. ఉమా శంకర్, ఆర్గనైజింగ్ చైర్ పర్సన్ డా.జార్జి రెడ్డి, డా. ఫణి కాంత్, డా. రవితేజ ఇన్నమూరి, డా. అశోక్ అలిమ్ చందాని, తదితరులు పాల్గొన్నారు.