శామీర్‌పేట/కీసర, అక్టోబర్ 2: బీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలోనే ఆదర్శవంతమైన పరిపాలన అందిస్తున్నదని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. తూం కుంట మున్సిపాలిటీ దేవరయాంజాల్ శివశివాని మల్లన్న కాలనీలో సోమవారం రూ. కోటి 86 లక్షలతో సీసీ రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. చిన్నారులతో కలిసి స్వచ్ఛ సర్వేక్షన్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ పల్లెలు, పట్టణాల అభివృద్ధికి బాటలు వేస్తున్నారని కొనియాడారు. దేశంలోని ఏ రాష్ట్రం, ఏ ప్రభుత్వం చేపట్టని కార్యక్రమాలను ప్రజలకు అందిస్తున్న తెలంగాణను దేశంలోనే నెంబర్‌వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నారని పేర్కొ న్నారు. కొత్త మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు.
మురహార్పల్లిలో గ్రామపంచాయతీ, మహిళా భవనాల ప్రారంభం
అనంతరం మురహార్పల్లిలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనం, మహిళా భవనం, సీసీ కెమెరాలను మంతి ప్రారంభించారు. కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ కారంగుల రాజేశ్వర్‌రావు, వైస్ చైర్మన్ వాణివీరారెడ్డి, కమిషనర్ జేతూరామ్నాయక్, కౌన్సిలర్లు యాదమ్మానర్సింగ్రావు, ఉమాశ్రీనివాస్ముదిరాజ్, రాజ్కుమార్యాదవ్, నర్సింగ్రావుగౌడ్,సురేశ్, నర్సింగ్, కోఆఫ్షన్ సభ్యుడు షఫిఉల్లాబేగ్, బీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు నోముల శ్రీనివాస్‌రెడ్డి, ఆలయ చైర్మన్ సుధాకర్‌రెడ్డి, మాజీ ఎంపీపీలు చంద్రశేఖర్‌యాదవ్, యాదగిరి, ఏఎంసీ మాజీ చైర్ పర్సన్ సునీతలక్ష్మీ, సర్పంచ్ భాస్కర్, ఉపసర్పంచ్ జైపాల్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌లు బోజేశ్వర్రావు, గోల్డ్ శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కీసరలో రూ. 70లక్షలతో యూజీడీ పనులకు మంత్రి శంకుస్థాపనగ్రామాల్లో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. కీసర మండలకేంద్రంలోని ది పెంతో కిస్టల్ చర్చ వద్ద రూ.70లక్షలతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులకు సోమవారం మంత్రి శంకుస్థాపన చేసి మాట్లాడారు. రాజకీయలకతీతంగా, మతాలకు అతీతంగా అన్ని వర్గాలకు, అన్ని మతాల అభ్యున్నతికి కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నామన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సముచిత న్యాయం చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ప్రభుత్వ పరంగానే కాకుండా తన ట్రస్టు ద్వారా కోట్లాది రూపాయలు వెచ్చించి అభివృద్ధి చేస్తున్నామన్నారు.
రుద్ర క్రికెట్ అకాడమీ ప్రారంభం
కీసరలో రుద్ర క్రికెట్ అకాడమీని మంత్రి ప్రారంభించారు. క్రీడకారులతో మాట్లాడి తగు సూచనలు జేశారు. కార్యక్రమంలో కీసర సర్పంచ్ మాధురీవెంకటేశ్, ఎంపీటీసీ నారాయణశర్మ, ఉప సర్పంచ్ లక్ష్మణ్‌శర్మ, పీఏసీఎస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు జాలాల్పురం సుధాకర్‌రెడ్డి, నాయకులు వెంకటేశ్ ముదిరాజ్, శ్రావన్‌కుమార్, శశికాంత్, జంగయ్యయాదవ్, గుర్రం మల్లారెడ్డి, ఆరిఫ్, తదితరులు పాల్గొన్నారు.