హైదరాబాద్: హైదరాబాద్ (Hyderabad) స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం గెలుపొందింది. ఆ పార్టీ అభ్యర్థి మీర్జా రియాజ్ ఉల్ హాసన్ విజయం సాధించారు. క్రాస్ ఓటింగ్‌పై గంపెడాశలు పెట్టుకున్న బీజేపీకి భంగపాటు తప్పలేదు. మొత్తం పోలైన ఓట్లలో ఆ పార్టీ అభ్యర్థి గౌతమ్‌రావుకు 25 ఓట్లు మాత్రమే రాగా, ఎంఐఎం క్యాండిడేట్‌కు 63 ఓట్లు వచ్చాయి.
22 ఏండ్ల తర్వాత జరిగిన హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ, ఎంఐఎం మాత్రమే పోటీచేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పోటీకి దూరంగా ఉన్నాయి. ఈ నెల 23న ఎన్నిక జరిగింది. ఇక్కడ మొత్తం 112 మంది ఓటర్లు ఉన్నారు. ఎంఐఎంకు 49 ఓట్లు ఉండగా, ఇతర పార్టీల మద్దతుతో విజయం సాధించారు.