ఎయిర్‌పోర్టు మెట్రోకు అనుసంధానం
గ్రేటర్ చుట్టూ ఉన్న ఔటర్ రింగు రోడ్డుపై 19 చోట్ల ఇంటర్ చేంజ్‌లు ఉండగా, మరో 3 చోట్ల కొత్తగా నిర్మిస్తున్నారు. ఈ ఇంటర్చేంజ్లన్నీ ప్రజా రవాణా పరంగా ఎంతో కీలకమైనవి. ఇతర రాష్ర్టాల నుంచి వచ్చే జాతీయ రహదారులతో పాటు రాష్ట్రంలోని జిల్లాల నుంచి ప్రధాన రహదారులను కలుపుతూ ఉంటాయి. ఇలాంటి చోట ప్రజా రవాణా వ్యవస్థకు అనుకూలమైన
- ఔటర్‌పై కొత్తగా ఐదు ఇంటర్ చేంజ్‌లు
- ఆ ప్రాంతాల్లో స్టేషన్లు నిర్మించేలా ప్రతిపాదనలు
సిటీబ్యూరో, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ చుట్టూ ఉన్న ఔటర్ రింగు రోడ్డుపై 19 చోట్ల ఇంటర్ చేంజ్‌లు ఉండగా, మరో 3 చోట్ల కొత్తగా నిర్మిస్తున్నారు. ఈ ఇంటర్చేంజ్లన్నీ ప్రజా రవాణా పరంగా ఎంతో కీలకమైనవి. ఇతర రాష్ర్టాల నుంచి వచ్చే జాతీయ రహదారులతో పాటు రాష్ట్రంలోని జిల్లాల నుంచి ప్రధాన రహదారులను కలుపుతూ ఉంటాయి. ఇలాంటి చోట ప్రజా రవాణా వ్యవస్థకు అనుకూలమైన మౌలికవసతులను కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వ శాఖలపై ఉంటుంది.
ఈ విషయాన్ని గుర్తించిన హైదరాబాద్ మెట్రో అధికారులు ఐటీ కారిడార్‌లోని మొదటిదశ మెట్రో మార్గంలోని చివరి మెట్రో స్టేషన్ అయిన రాయదుర్గంతో అనుసంధానం చేస్తూ శంషాబాద్ అంతరాత్జీయ విమానాశ్రయం వరకు మార్గ మధ్యలో ఓఆర్ఆర్ వెంబడి ఉన్న 5 ఇంటర్‌చేంజ్‌లను కొత్తగా నిర్మించే మెట్రో స్టేషన్లతో అనుసంధానం చేయనున్నారు. ఇందులో నానక్‌రాంగూడ, నార్సింగి-మంచిరేవుల, తెలంగాణ పోలీస్ అకాడమీ, రాజేంద్రనగర్, శంషాబాద్లలోని ఓఆర్ఆర్ ఇంటర్‌చేంజ్‌ల వద్ద మెట్రో స్టేషన్లను నిర్మించేలా ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. భవిష్యత్ అవసరాలను ముందుగానే గుర్తించి నగరం నుంచి రాష్ట్రంలోని ఇతర జిల్లా కేంద్రాలు, ఇతర రాష్ర్టాలకు వెళ్లాలంటే మెట్రో రైలు మార్గం ద్వారా సులభంగా ఓఆర్ఆర్ ఇంటర్‌చేంజ్‌లకు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రయాణికులు తమ తమ గమ్య స్థానాలను చేరుకునేందుకు వీలుగా అవసరమైన మౌలిక వసతులను కల్పించనున్నామని మెట్రో అధికారులు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

