పీర్జాదిగూడ సెట్విన్ కేంద్రంలో ఏర్పాటు
50 కంపెనీలు హాజరు
యువత సద్వినియోగం చేసుకోవాలి: మంత్రి మల్లారెడ్డి
10వేల మందికి ఉద్యోగ అవకాశం
మేడ్చల్, ఏప్రిల్24(నమస్తే తెలంగాణ) : నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పీర్జాదిగూడ సెట్విన్ టెక్నికల్ శిక్షణ కేంద్రంలో ఈ నెల 30న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మేళాలో 50కి పైగా కంపెనీలు పాల్గొని 10వేల పైచిలుకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయని చెప్పారు.
ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనున్న ఈ జాబ్‌మేళాను పది, ఇంటర్, బీటెక్, ఎంటెక్, బీఏ, బీఎస్సీ, బీకాం, ఎంబీఏ, ఎంసీఏ, ఎంసీఎస్, బీఫాం, ఎంఫాం, హోటల్ మేనేజ్మెంట్, పీజీ పూర్తయిన నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జాబ్‌మేళాలో పాల్గొనే నిరుద్యోగులు 8610226987, 8801279471 నంబర్లకు ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.