మెహిదీపట్నం, మే 27 : రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో పేరున్న పాఠశాలల్లో టీచర్ ఉద్యోగాలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్, రాంకీ ఫౌండేషన్, గ్రీన్ ల్యాండ్స్ లయన్స్ క్లబ్ ప్రతినిధులు రాంరెడ్డి, సందీప్ హరి, డాక్టర్ లక్ష్మి కుమారి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 31న సికింద్రాబాద్ బోయిగూడలోని గుజరాతి ఉన్నత పాఠశాల ఆవరణలో మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నామని చెప్పారు. నిరుద్యోగులు ఈ అవకా శాన్ని సద్వినియోగం చేసుకోవాల న్నారు.
టీచర్ ఉద్యోగాలే కాకుండా 10 వ తరగతి నుంచి డిగ్రీ వరకు వారి అర్హతను బట్టి వివిధ కంపెనీల్లో ఉద్యోగాలను కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఈ జాబ్‌మేళాలో సుమారు 20 కి పైగా కంపెనీలు పాల్గొంటున్నాయని చెప్పారు. ఆసక్తి ఉన్న వారు పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్‌కు సంబంధించిన ఇన్స్టాగ్రాం ఐడీలో, ఫేస్బుక్ పేజ్‌లో, యూ ట్యూబ్ ఛానల్లో సంప్రదించాలని కోరారు. అలాగే https:// forms.gle/zc83VxC9uNc9AqBT9 లింక్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, https://whatsapp. com/channel/0029VafKOSY6buMO7mQVzY3r వివరాలకు వాట్సప్ లింక్‌లో సంప్రదించాలని కోరారు.