MRP | సిటీబ్యూరో, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): ఎంఆర్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తున్న ఔషధాలను డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు సీజ్ చేశారు. డీసీఏ అధికారుల కథనం ప్రకారం.. గాజులరామారం పరిధిలోని అలీప్ ఇండస్ట్రీయల్ ఎస్టేట్‌లో ఉన్న ‘మెడ్జిన్ లైఫ్ సైన్సెస్’ ఫార్మా కంపెనీ తయారు చేస్తున్న మపిరోసిన్ ఆయింట్మెంట్ను ఎంఆర్పీ కంటే రూ.
30.37కు అధికంగా విక్రయిస్తున్నారు. సమాచారం అందుకున్న డీసీఏ అధికారులు అధిక ధరలకు విక్రయిస్తున్న ఆయింట్మెంట్ ట్యూబ్స్‌ను సీజ్ చేసి, తయారీ కంపెనీకి నోటీసులు జారీ చేసినట్లు డీసీఏ డీజీ వీబీ కమలాసన్‌రెడ్డి వెల్లడించారు.