సిటీబ్యూరో, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): నిబంధనలకు విరుద్ధంగా ఔషధాలు విక్రయిస్తున్న పలు మెడికల్ షాప్‌లు, క్లినిక్‌లపై డీసీఏ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా దాడులు జరిపారు. పలు ఔషధాలను సీజ్ చేశారు. డీసీఏ డీజీ కమలాసన్‌రెడ్డి కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లాలోని నస్పూర్ గ్రామంలో ఓ క్లినిక్‌లో 76 ఔషధాలను, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో ఫెర్రోర్డ్-ఎక్స్‌టీ మాత్రలను సీజ్ చేశారు.
నగరంలోని రాజేంద్రనగలో పలు మెడికల్ షాపుల్లో నిబంధనలకు విరుద్ధంగా పలు రకాల ఔషధాలపై ప్రకటనలు ముద్రించి విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో డీసీఏ అధికారులు పలు ఆయుర్వేద మెడికల్ షాపులపై దాడులు జరిపారు. గుండె, కిడ్నీ, బీపీ, షుగర్ తదితర వ్యాధుల పేరుతో కూడిన లేబుళ్లు ముద్రించిన మందులను సీజ్ చేశారు.