సిటీబ్యూరో, మే 31, (నమస్తే తెలంగాణ): పొగాకు వాడకానికి దూరంగా ఉండాలని హైదరాబాద్ జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటి తెలిపారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శనివారం జిల్లా వైద్యశాఖ ఆధ్వర్యంలో నగరంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ వెంకటి మాట్లాడుతూ.. అవగాహన, మానసిక బలంతో పొగాకు వినియోగాన్ని తగ్గించగలిగితే లక్షల మరణాలను కాపాడవచ్చన్నారు. కార్యక్రమంలో ఎన్సీడీ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ అశ్రిత రెడ్డి, జిల్లా మాస్ మీడియా అధికారి జక్కుల రాములు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని హైదరాబాద్ జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటి తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల ఔట్ పేషెంట్, ఇన్ పేషెంట్ సమాచారం సేకరిస్తున్నట్లు వెల్లడించారు. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలు, ప్రభుత్వ ఆస్పత్రులలో డయాగ్నోస్టిక్ సేవలు అందుబాటులో ఉనాన్నాయన్నారు. ప్రతిరోజు ఇంటింటి వ్యాధుల సర్వే నిర్వహిస్తూ.. జూన్ నెలను యాంటీ మలేరియా నెలగా, జూలై నెలను యాంటీ డెంగ్యూ నెలగా నిర్వహిస్తామని తెలిపారు.
నాంపల్లి క్రిమినల్ కోర్టులు, మే 31 (నమస్తే తెలంగాణ): పొగాకు వాడకాన్ని యువత దూరంగా ఉండాలని 4వ అదనపు జిల్లా జడ్జి సాయిభూపతి పిలుపునిచ్చారు. నాంపల్లి కోర్టుల బార్ అసోసియేషన్, హైదరాబాద్ జిల్లా న్యాయసేవాధికార సంస్థ సంయుక్తంగా శనివారం కోర్టుహాల్లో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించారు. జిల్లా జడ్జి వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. పొగాకు వాడకూడదని న్యాయవాదులు తమ కక్షిదారులకు నచ్చజెప్పినైట్లెయితే మార్పు జరుగుతుందన్నారు.
నాంపల్లి కోర్టుల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రవికిశోర్, కార్యదర్శి మహ్మద్ అబ్దుల్ జావేద్ పాషా, సీనియర్ సివిల్ జడ్జి, కార్యదర్శి మహ్మద్ అబుద్దుల్ జావేద్ పాషా, ఉపాధ్యక్షులు రవీందర్, జి.చంద్రమోహన్, సంయుక్త కార్యదర్శి గోపి, స్పోర్ట్స్ కార్యదర్శి ఎమ్.సాయిచంద్, మహిళా ప్రతినిధి పద్మావతి, ఎగ్జిక్యూటివ్ సభ్యులు శ్రీలత, లోకేశ్, ప్రొనీత్సింగ్ పవార్, మోహన్. భీమ్‌సింగ్, ఆశ, అక్షయ్‌సింగ్, వెంకటేశ్, సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.