మేడ్చల్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): డిసెంబర్ 3న మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బీఆర్ఎస్ కార్యాలయాన్ని వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవ ఏర్పాట్లపై కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ క్యాంపు కార్యాలయంలో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు మంగళవారం సమావేశమయ్యారు. జిల్లా నలుమూలల నుంచి పార్టీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, మహిళా విభాగం సభ్యులు, యువజన విభాగం నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరుకావాలని పిలుపునిచ్చారు.
పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేసేలా జిల్లాలోని నియోజకవర్గాల నుంచి భారీగా కార్యకర్తలు తరలివచ్చేలా ప్రణాళికను ఎమ్మెల్యేలు సిద్ధం చేశారు. ఈ సమావేశంలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్, ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి పాల్గొన్నారు.