రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమే..
వచ్చే ఎన్నికల్లో తనను గెలిపించాలని, మేడ్చల్‌ను మోడల్ టౌన్‌గా మారుస్తానని కార్మిక శాఖా మంత్రి చామకూర, బీఆర్ఎస్ మేడ్చల్ అభ్యర్థి చామకూర మల్లారెడ్డి ప్రజలను కోరారు.
- కాంగ్రెస్‌పై ప్రజలకు నమ్మకం లేదు
- మోడల్ టౌన్‌గా మేడ్చల్‌ను మారుస్తా..
- ఎన్నికల ప్రచారంలో మంత్రి మల్లారెడ్డి
మేడ్చల్, నవంబరు 14: వచ్చే ఎన్నికల్లో తనను గెలిపించాలని, మేడ్చల్‌ను మోడల్ టౌన్‌గా మారుస్తానని కార్మిక శాఖా మంత్రి చామకూర, బీఆర్ఎస్ మేడ్చల్ అభ్యర్థి చామకూర మల్లారెడ్డి ప్రజలను కోరారు. మంగళవారం మంత్రి మల్లారెడ్డి మేడ్చల్ పట్టణంలోని వివిధ వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగున్నరేండ్ల పాటు ప్రజల్లో ఉండి పని చేశానన్నారు. సీసీ రోడ్లు, కరెంట్, తాగునీరు, పార్కులు, నాలాలు అభివృద్ధి, వైకుంఠధామాలు ఇలా ఎన్నో అభివృద్ధి చేశానని తెలిపారు. సొంత నిధులతో సీసీ రోడ్లు వేయించానని, గుడులు కట్టించానని, కుల సంఘాల భనాలను నిర్మించానని తెలిపారు. మేడ్చల్ భవిష్యత్‌లో ఎంతో అభివృద్ధి చెందనుందన్నారు. ఔటర్ రింగు రోడ్డు, జాతీయ రహదారి ఉందని, ఫ్లైఓవర్లు రానున్నాయని తెలిపారు.ఎన్నికల తర్వాత అన్ని రంగాల్లో మేడ్చల్‌ను అభివృద్ధి చేసి, ఆదర్శంగా తీర్చిదిద్దుతానని తెలిపారు.
క్రైస్తవుల శ్మశాన వాటికకు 2.20 ఎకరాల భూమి కేటాయించి, కరెంట్ సౌకర్యం కల్పించామని తెలిపారు. మార్వాడీలకు గోశాల నిర్మాణానికి 15 గుంటల స్థలం కేటాయిస్తున్నామని ఆయన చెప్పారు. అన్ని మతాలు, కులాలు, వర్గాలకు సమాన ప్రాధాన్యతనిస్తున్నామని తెలిపారు. సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అభివృద్ధి చేయడంతో పాటు సంక్షేమంలో నంబర్ వన్ స్థానంలో నిలిపారన్నారు. ఎక్కడ చూసినా పల్లె, పట్టణాలు పచ్చదనం కళకళలాడుతున్నాయని, సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, డంపింగ్‌యార్డు, వైకుంఠధామాలు కన్పిస్తున్నాయని తెలిపారు.ఇంటింటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, హ్యాట్రిక్ సీఎం కేసీఆరే అన్నారు. మున్సిపాలిటీ చైర్పర్సన్ మర్రి దీపికానర్సింహారెడ్డి మాట్లాడుతూ మేడ్చల్ పట్టణాన్ని అభివృద్ధి చేయడంలో మంత్రి మల్లారెడ్డి ఎంతో సహకారం అందించారని ఆమె తెలిపారు. ప్రతి ఒక్కరూ కారుకు గుర్తు ఓటేసి, మల్లారెడ్డిని గెలిపించాలని ఆయన కోరారు.
రూ.30 లక్షలతో హనుమాన్ గుడి
అన్ని వార్డుల్లో ఆలయానికి డబ్బులు కేటాయిస్తున్నారని, మా వార్డు హనుమాన్ ఆలయానికి నిధులు ఇవ్వాలని బీఆర్ఎస్ 8వ వార్డు అధ్యక్షుడు ఖాసీం కోరారు. వెంటనే మంత్రి వార్డులోని పెద్దలను తీసుకురావాలని సూచించారన్నారు. అందరితో మాట్లాడి రూ.30లక్షల ఇచ్చారని, ఆ నిధులతో వార్డులో పెద్ద హనుమాన్ ఆలయాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు. దీంతో వార్డు ప్రజలంతా ఏకపక్షంగా మంత్రి గెలిపించుకోవాలని నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్పర్సన్ మర్రి దీపికానర్సింహారెడ్డి, వైస్ చైర్మన్ చీర్ల రమేశ్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, బీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు శేఖర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ యాదవ్, నాయకులు మర్రి నర్సింహా రెడ్డి, విష్ణుచారి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

