కార్పొరేటర్లంతా నా వైపే..
‘కార్పొరేటర్లంతా నా వైపే ఉన్నారు. బలవంతంగా కార్పొరేటర్లను బస్సులో ఎక్కించుకొని పోయినంత మాత్రానా అవిశ్వాసం నెగ్గలేరు. క్యాంపులో ఉన్న కార్పొరేటర్లంతా నాతో ఫోన్లో సంభాషిస్తున్నారు.
- మేయర్ మేకల కావ్య
జవహర్నగర్: ‘కార్పొరేటర్లంతా నా వైపే ఉన్నారు. బలవంతంగా కార్పొరేటర్లను బస్సులో ఎక్కించుకొని పోయినంత మాత్రానా అవిశ్వాసం నెగ్గలేరు. క్యాంపులో ఉన్న కార్పొరేటర్లంతా నాతో ఫోన్లో సంభాషిస్తున్నారు. అవిశ్వాసం నెగ్గుతా’.. అంటూ మేయర్ మేకల కావ్య ధీమా వ్యక్తం చేశారు. జవహర్నగర్ కార్పొరేషన్లో ఆదివారం మేయర్ మేకల కావ్య అవిశ్వాసంపై స్పందిస్తూ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జవహర్నగర్ కార్పొరేషన్లో అద్భుతమైన ప్రగతి పనులు చేశామని, ప్రతి డివిజన్లోనూ డ్రైనేజీ, సీసీ రోడ్లు, ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్లను ఉచితంగా అందజేశామని గుర్తు చేశారు. ‘ నాపై జరుగుతున్న కుట్రలను తిప్పి కొడతాం. చదువుకున్న మహిళ… పాలనలో ప్రగతి సాధిస్తుందని ఓర్వలేకపోతున్నారు. జవహర్నగర్ ప్రజలకు మెరుగైన సేవలు అందించాను. చదువు, సమాజంపై అవగాహన లేని వారిని కుర్చిలో కూర్చోబెడితే వారు ఆడిందే ఆటా… పాడిందే పాటగా మారుతుందని భ్రమలో ఉన్నారు. వారి ఆటలు ఇకపై సాగినివ్వం… అవిశ్వాసంపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. పూర్తి మెజార్టీ ఇప్పటికే ఉంది’ అని చెప్పారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

