సిటీబ్యూరో, ఆగస్టు 9(నమస్తే తెలంగాణ): గ్రేటర్‌ను స్వచ్ఛ, పచ్చ నగరంగా మార్చాలన్న ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని, అందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి పిలుపునిచ్చారు. స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మాసబ్ ట్యాంక్‌లోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కాట, నాంపల్లి ఎమ్మెల్యే మజీద్ హుస్సేన్‌లు పాల్గొని కళాశాల ఆవరణలో మొకలు నాటారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు మొకలు నాటడం ప్రతి ఒకరి బాధ్యత అని మేయర్ చెప్పారు.
కాలుష్య రహిత సమాజానికి పాటు పడాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమంలో గడిచిన ఐదు రోజుల పాటు అన్ని వర్గాల ప్రజలకు పరిశుభ్రత, పచ్చదనంపై పెద్ద ఎత్తున అవగాహన కల్పించామని తెలిపారు. నగరంలోని అన్ని కాలనీలలో, గార్బేజ్ పాయింట్లలో గార్బేజిని, సీ అండ్ డీ వేస్ట్‌ను క్లీన్ చేయడం జరిగిందన్నారు. ప్రధానంగా నగరంలో ఈ సంవత్సరం 50 లక్షల మొకలు నాటడం లక్ష్యం కాగా, ఇప్పటివరకు 13 లక్షల మొకలు నాటడం పూర్తయ్యిందని తెలిపారు. ప్రతి ఒకరు కాలుష్య రహిత సమాజానికి పాటుపడాలని డిప్యూటీ మేయర్ కోరారు. ఆరోగ్యకర జీవనానికి పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ, మొకలు నాటాలన్నారు.
నగరాన్ని పరిశుభ్ర, స్వచ్ఛ నగరంగా అభివృద్ధి చేసుకోవడం అందరి సామాజిక బాధ్యతని కమిషనర్ ఆమ్రపాలి అన్నారు. గ్రేటర్ వ్యాప్తంగా విరివిగా మొకలు నాటాలన్నా రు. చెట్లను రక్షిస్తే చెట్లు మనని రక్షిస్తాయని పేరొన్నారు. పరిశుభ్రతతోనే దోమలను నివారించవచ్చని, దోమలతో వ్యాప్తి చెందే వ్యాధులను నియంత్రించగలుగుతామని తె లిపారు. ఈ కార్యక్రమం సందర్భంగా గ్రేటర్లో 38 లోకేషన్స్‌లో ప్రజా ప్రతినిధుల సహకారంతో మొకలు నాటినట్లు ప్రజలకు అవసరమైన మొకలు ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు ఇప్పటి వరకు, సుమారు 5.5 లక్షల మొకలను ఇంటింటికీ పంపిణీ చేసినట్లు పేరొన్నారు.
వన మహోత్సవం సందర్భంగా 38 లోకేషన్స్‌లో సుమారు 15 వేల మొకలు నాటినట్లు కమిషనర్ ఆమ్రపాలి కాట పేరొన్నారు. అంతకు ముందు కళాశాల ఆవరణలో మేయర్, డిప్యూటీ మేయర్, కమిషనర్, నాంపల్లి శాసన సభ్యులు మొక లు నాటారు. అధికారులు, విద్యార్థులు, కార్పొరేటర్లు పెద్ద ఎత్తున మొకలు నాటారు. అనంతరం విద్యార్థులు, కాలనీ వాసులకు ఈ సందర్భంగా మొకలను పంపిణీ చేశారు.
గ్రేటర్లో వరద నీటి కాలువల్లో నీరు నేరుగా పోయే విధంగా చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఉన్నతాధికారులను ఆదేశించారు. నాలాలో అక్కడక్కడ నీటి నిలువతో దోమలు బ్రీడింగ్‌కు అవకాశం ఉన్నందున వెంటనే ఆయా ప్రాంతాలలో దోమలు వ్యాప్తి చెందకుండా పూడికతీత చేపట్టాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. కమిషనర్ జోనల్, అడిషనల్ కమిషనర్లతో శుక్రవారం ఉదయం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
స్మార్ట్ వాటర్ డ్రైన్, మూసీ నదిలో వరద నీరు నేరుగా వెళ్లలేకపోవడంతో స్టాగ్నేషన్ అయి దోమలు బ్రీడింగ్ ఎక్కువగా అవుతున్నాయని, వెంటనే వాటిని తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు. సీఆర్ఎంపీ ద్వారా చేపట్టిన బీటీ రోడ్ల నిర్వహణ త్వరలో అగ్రిమెంట్ పూర్తికావస్తున్న నేపథ్యంలో వారు ఇంకా మిగిలిన పనులు చేయలసిన వెంటనే పూర్తి చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని జోనల్ కమిషనర్లకు ఆదేశించారు. ఫుట్‌పాత్‌లో సెంట్రల్ మీడియన్, కర్బ్లైన్, లైన్‌మార్కింగ్ పనులను అన్ని జోనల్లో పూర్తి చేయాలని కమిషనర్ జోనల్ కమిషనర్లను కమిషనర్ ఆదేశించారు.
సిటీబ్యూరో, ఆగస్టు 9(నమస్తే తెలంగాణ): స్వచ్ఛ ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరించాలని స్వచ్ఛ ఆటో సంఘాల నేతలు జీహెచ్ఎంసీ కమిషనర్ కాట ఆమ్రపాలిని శుక్రవారం కలిసి వినతిపత్రం సమర్పించారు. రాంకీతో తమకు ఇబ్బందులు వస్తున్నాయని కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు. జీహెచ్ఎంసీనే నమ్ముకుని బతుకుతున్న కార్మికులను గుర్తించాలని, సెకండరీ పాయింట్స్ వద్ద స్వచ్ఛ ఆటోలు పడుతున్న ఇబ్బందులను కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో స్వచ్ఛ ఆటో ప్రెసిడెంట్ రాజేందర్ పాల్గొన్నారు.