సిటీబ్యూరో, మే 9 (నమస్తే తెలంగాణ ): జవహర్‌నగర్‌లో జరిగిన ప్రమాదంలో ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోవడంతో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై శుక్రవారం శానిటేషన్ అధికారులు, రాంకీ యాజమాన్యంతో మేయర్ సమీక్షించారు. ఈ సందర్భంగా రాంకీ యాజమాన్యం ప్రమాద కారణాలను మేయర్‌కు వివరించడంతో పాటు భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపి.. పబ్లిక్ వర్క్స్ కాంట్రాక్ట్ నిబంధనల మేరకు ఒక్కో బాధిత కుటుంబానికి రూ.15 లక్షల పరిహారం అందజేయనున్నట్లు ప్రకటించారు.
మొదటి విడతగా ఒక్కొక్కరికి రూ. 4 లక్షల పరిహారం శుక్రవారం అందజేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో శానిటేషన్ అడిషనల్ కమిషనర్ రఘు ప్రసాద్, రాంకీ ప్రాజెక్టు డైరెక్టర్ అగర్వాల్, తదితరులు పాల్గొన్నారు.