Temperatures | సిటీబ్యూరో, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగింది. రాత్రి ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గాయి. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 32.4, కనిష్ఠం 19.2 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 51 శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఎలాంటి వర్ష సూచనలు లేవని పేర్కొన్నారు.