హైదరాబాద్ : ఇబ్రహీంపట్నం పరిధిలోని కర్ణంగూడ వద్ద చోటు చేసుకున్న కాల్పుల కేసును రాచకొండ పోలీసులు ఛేదించారు. రియల్లర్లు శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి హత్యల కేసులో మట్టారెడ్డి సహా ఐదుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. సరూర్ నగర్ ఎస్వోటీ కార్యాలయంలో నిందితులను విచారిస్తున్నారు. ఈ కేసులో లేక్ వ్యూ విల్లా ఓనర్స్ అసోసియేషన్ సభ్యులను సైతం పోలీసులు విచారిస్తున్నారు.
సుపారీ గ్యాంగ్‌తో శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డిలను మట్టారెడ్డి హత్య చేయించినట్లు పోలీసుల విచారణలో తేలింది. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మరికాసేపట్లో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.