కాచిగూడ,డిసెంబర్ 18: మహిళలు కరాటేను నేర్చుకోవడానికి ధైర్యంగా ముందుకు రావాలని వరల్డ్ రికార్డ్స్ హోల్డర్, కరాటే మాస్టర్ జీఎస్ గోపాల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కాచిగూడలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ సమాజంలో మహిళలకు కరాటే అవశ్యకతను వివరిస్తూ వారికి అవసరమైన మెలకువలను నేర్పించి, స్వయంగా తమను తాము రక్షించుకోవడానికి అవవరమైన శిక్షణ ఇవ్వన్నుట్లు పేర్కొన్నారు.
ఆత్మరక్షణ కోసం మహిళలు కరాటేను తప్పనిసరిగా నేర్చుకోవాలని, ఉద్యోగంతో పాటు మహిళలు కరాటేను అభ్యసించడం ఎంతో అవసరమని సూచించారు. కరాటే శిక్షణ పొందితే ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉచిత కరాటే శిక్షణ కోసం 9494112424లో సంప్రదించవచ్చని సూచించారు.