ట్రాఫిక్ జాం.. సుచిత్ర నుంచి కొంపల్లి వరకు నిలిచిన వాహనాలు
Traffic jam | సుచిత్ర నుంచి కొంపల్లి వరకు భారీగా వాహనాలు నిలిచిపోయాయి (Traffic jam). బుధవారం రాత్రి కుండపోతగా వాన కురియడంతో కొంపల్లి-దూలపల్లి రోడ్డులో రోడ్డు కోతకుగురై
హైదరాబాద్: నగర శివార్లలోని సుచిత్ర నుంచి కొంపల్లి వరకు భారీగా వాహనాలు నిలిచిపోయాయి (Traffic jam). బుధవారం రాత్రి కుండపోతగా వాన కురియడంతో కొంపల్లి-దూలపల్లి రోడ్డులో రోడ్డు కోతకుగురై ధ్వంసమైంది. దీంతో మేడ్చల్ వైపు వెళ్లే వాహనాలు సుచిత్ర వద్దే ఆగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో భారీగా ట్రాఫిక్ జాం అయింది. ట్రాఫిక్ పోలీసులు వాహనాలను మరోదారిలో మళ్లిస్తున్నారు.
కాగా, రాత్రి కురిసిన వర్షానికి గుండ్లపోచంపల్లి చెరువు నిండిపోయింది. చెరువు అలుగుపోస్తుండటంలో రోడ్డుపైనుంచి నీరు ప్రవహిస్తున్నది. శామీర్‌పేట మండలంలోని తూంకుంటలో భారీవర్షానికి ఓ ప్రైవేటు పాఠశాల నీటమునిగింది. తరగతి గదుల్లో వర్షపు నీరు ప్రవేశించింది. హైదరాబాద్‌తోపాటు చుట్టుపక్కల జిల్లాల్లో బుధవారం రాత్రి 10 గంటలకు ప్రారంభమైన వర్షం అర్ధరాత్రి 12.30 గంటల వరకు ఎడతెరపిలేకుండా పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

