అల్లు అర్జున్ కథానాయకుడిగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ ‘రాకా’ తాలూకు ఆసక్తికరమైన అప్డేట్ బయటికొచ్చింది. ఇందులో బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్ అతిథి పాత్రలో కనిపించబోతున్నారని తెలిసింది. అట్లీ దర్శకత్వంలో షారుఖ్‌ఖాన్ చేసిన ‘జవాన్’ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో అట్లీ కోరిక మేరకు ‘రాకా’లో అతిథి పాత్రలో నటించేందుకు షారుఖ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని ముంబయి ఫిల్మ్‌సర్కిల్స్‌లో వినిపిస్తున్నది.
ఇదేగనుక నిజమైతే ఈ సినిమాకు మరింత హైప్ రావడం ఖాయమని అభిమానులు అనుకుంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటున్నది. వెయ్యి కోట్ల బడ్జెట్‌తో రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. తొలిభాగం హిస్టారికల్ బ్యాక్‌గ్రౌండ్‌లో, రెండో భాగం ఫ్యూచరిస్టిక్ వరల్డ్‌లో కొనసాగుతుందని చెబుతున్నారు. ఈ చిత్రంలో దీపికా పడుకోన్ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. మరో నాయికగా మృణాల్ ఠాకూర్ పేరు కూడా వినిపిస్తున్నది.