జవహర్‌నగర్, నవంబర్ 13: కారు స్పీడుకు విపక్షాలు విలవిలలాడుతున్నాయని, బీఆర్ఎస్కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని బీఆర్ఎస్ మేడ్చల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి మల్లారెడ్డి అన్నారు. సోమవారం కార్పొరేషన్‌కు చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు మల్లారెడ్డి, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్, చామకూర మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో 50మంది కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వమే రాబోతుందని, అభివృద్ధి చేసిన తెలంగాణ ప్రభుత్వన్నే ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ప్రజలు కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పల్లపు రవి, శ్రీనివాస్‌రెడ్డి, రాజ్‌కుమార్, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొండల్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి రెడ్డిశెట్టి మహేశ్, బండకింది ప్రసాద్, మేకల రాజు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
గ్యారంటీలతో గారడి చేస్తున్న కాంగ్రెస్
పీర్జాదిగూడ, నవంబర్13: కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రైతులకు 24 గంటల కరెంటు వద్దు మూడు గంటలు సరిపోతుందని మాట్లాడం సిగ్గుచేటని పీర్జాదిగూడ కార్పొరేషన్ మేయర్ జక్క వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మేడిపల్లి బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకురుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులకు కరెంటు ఇవ్వకుండా, ఎరువులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేశారని గుర్తు చేశారు.
తెలంగాణ ప్రభుత్వం వచ్చినంక రైతులకు 24 గంటల కరెంటు, ఎరువులు సమృద్ధిగా ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనని అన్నారు. కాంగ్రెస్ నాయకులు గ్యారెంటీలతో గారడి చేస్తున్నారని వారి మాటలు ప్రజలు నమ్మొద్దని సూచించారు. బీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధిను చూసీ ఆశీర్వదించాలని కోరారు.