Woman Missing | సైదాబాద్, జూన్ 4 : ఇంటి నుంచి బటయకు వెళ్లిన గృహిణి అదృశ్యమైంది. ఈ ఘటన సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సైదాబాద్ పూసల బస్తీకి చెందిన పసుపులేని నాగరాజు, సంధ్య (28) భార్యభర్తలు. నాగరాజు పెయింటింగ్ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సంధ్య గృహిణి. గత నెల 25వ తేదీన ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో బ్యాగ్లో బట్టలు సర్దుకొని బయటకు వెళ్లిపోయింది. భర్త, కుటుంబ సభ్యులు ఆమె ఆచూకీ కోసం వివిధ ప్రాంతాల్లో గాలించినప్పటికీ ఫలితం లేకపోవటంతో సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సంధ్య ఆచూకీ తెలిసిన వారు సైదాబాద్ పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.