హైదరాబాద్ : వివాహంపై ఎన్నో ఆశలతో మెట్టింట అడుగుపెట్టిన ఆమెకు నిరాశ ఎదురైంది. భర్త, పిల్లలో నిండూ నూరేండ్లు జీవించాలని ఆశ పడిన ఆ యువతి ఆశలు అడియాసలయ్యాయి. అగ్నిసాక్షిగా జీవితాంతం తోడుంటానని మనువాడిన వాడే ఆమె పాలిట యముడిగా మారాడు. అదనపు కట్నం( Dowry harassment) కోసం తరచూ మానసికంగా వేధించాడు. ఇన్నాళ్లు అత్తారింటి వేధింపులను పంటి బిగువున భరించిన ఆ సోదరి మనస్థాపంతో ఇక చావే శరణ్యమనుకొని ఆత్మహత్యకు(Commits Suicide) పాల్పడింది.
ఈ విషాదకర సంఘటన బాచుపల్లి స్టేషన్ పరిధి( Bachupally station area) సాయి నగర్లో చోటు చేసు కుంది. వివరాల్లోకి వెళ్తే.. అరుణ (26) అనే యువతికి 2017లో ఎర్రగళ్ల గోపి అనే వ్యక్తితో వివాహమైంది. అయితే అదనపు కట్నం కోసం గోపి అరుణనుతరచూ మానసికంగా వేధించేవాడని తెలిసింది. దీంతో మనస్థాపం చెందిన అరుణ ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందు కున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.