హైదరాబాద్ : కేపీహెచ్బీ పీఎస్(KPHB PS) పరిధిలో విషాదం చోటు చేసుకుంది. ఓ వివాహిత ఉరి వేసుకొని బలవన్మరణానికి(Married suicide) పాల్పడింది. వివరాల్లోకి వెళ్తే.. షంషీగూడలో కుటుంబ కలహాలతో అర్ధరాత్రి సుప్రియ అనే మహిళ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన స్థానికులు విషయాన్ని సుప్రియ తల్లిదండ్రులకు తెలిపారు. కాగా, ఆత్మహత్యకు పాల్పడినప్పుడుసుప్రియ భర్త రాఘవేందర్ రెడ్డి ఇంట్లో లేడని తెలిసింది. భర్త వేధింపుల వల్లే ఆత్మహత్యకు పాల్పడిందని సుప్రియ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.